టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల మెకానిక్ రాకీతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను మెప్పించాలని కసితో ప్రయతఇనిస్తున్నాడు విశ్వక్. ఇక లైలా మూవీతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో హైప పెంచేందుకు ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో లేడీ గెటప్ లో లైలా రోల్లో కనిపించనున్నాడు విశ్వక్. ఈ క్రమంలోనే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేయగా.. ఆ ఈవెంట్లో విశ్వక్ తన లేడీ గెటప్ ఫోటో ని చూసి వదిలేయండి. కత్తిలా ఉంది అనుకొన్ని అపేసెయ్యండ అంతే. దానికి మాత్రం వాడకండి అంటూ కామెంట్స్ చేశాడు.
దాదాపు అతను చెప్పింది వింటే దేనికి వాడొదని చెబుతున్నాడో క్లియర్‌గా తెలుస్తుంది. ఈ క్రమంలోనే విశ్వక్ తన లేడి గెటప్ పిక్ పై చేసిన బోల్డ్ కమెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ లైలా సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌లపై సాహూ గరికపాటి ప్రొడ్యూసర్‌గా తెరకెక్కిస్తున్నారు. లైలా టీజర్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా విశ్వక్ సేన్ సాలిడ్ హిట్ కొట్టాలని అభిమానులంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.