నందమూరి నటసింహం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి తమిళ్ రీమేక్ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించనున్నాడు. విజయ్ 69వ సినిమా భగవంత్ కేసరి రిమేకా.. కాదా.. అనే సందేహాలు నిన్న మొన్నటి వరకు తెగ వినిపించేవి. కానీ కొద్ది రోజుల క్రితం జరిగిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళ్ యాక్టర్ వీటిని గణేష్ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. పూర్తి రేంజ్ లో పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన విజయ్.. చివరిగా నటిస్తున్న సినిమా ఇదే కావడంతో.. ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్, టీజర్ అతి త్వరలో రిలీజ్ చేయను్న్నారు మేకర్స్.
అయితే ఈ లోపే టైటిల్ గురించి కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమాకు నాలయ్య తీర్పు.. అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తెలుగు మీనింగ్ రేపటి తీర్పు. ఇక తెలుగులో బాలయ్య నటించిన సినిమాకు భగవంత్ కేసరి అనే మాస్ టైటిల్ పెట్టగా.. తమిళ్లో మాత్రం రేపటి తీర్పు అనే క్లాస్ టచ్ ఉన్న టైటిల్ను ఫిక్స్ చేయడం విశేషం. అయితే ఈ టైటిల్ వెనక ఓ ఆసక్తికర నేపథ్యాన్ని కూడా క్రియేటివ్ గా రూపొందించనున్నరట. ఇక విజయ్ తన కెరీర్‌లో నటించిన మొట్టమొదటి మూవీ రేపటి తీర్పు. 18 ఏళ్లకే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన విజయ్.. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో అంచలంచలుగా ఎదుగుతూ.. కోలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోగా అవతారం ఎత్తాడు.
ప్రస్తుతం కోలీవుడ్ నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్న విజయ్.. ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నాడు. ఏపి డిప్యూటీ సీఎం పవన్‌కులా భవిష్యత్తులో సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తాడో.. లేదో.. తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన చివరి సినిమాగా భగవంత్ కేసరి రీమేక్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. తన ఫస్ట్ మూవీ టైటిల్‌ని దీనికి పెట్టడంతో అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఆడియన్స్‌ను ఎమోషనల్ గా కనెక్ట్ చేసేలా విజయ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక కోలీవుడ్‌లో శతురంగ వేట్టై, నీర్కొండ పార్వై, వలిమై, తునివు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన హెచ్. వినోద్ ఈ సినిమాను రూపొందించనున్నాడు. పూజా హెగ్డే కాజల్ పాత్రలో నటిస్తుండగా.. మమిత బైజు శ్రీలీలా రోల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది.