టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 రిలీజ్‌కు ముందు సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ప్రారంభం నుంచి.. పుష్ప సినిమాకు ముందు వరకు అన్ని సినిమాలకు దేవిశ్రీనే సంగీతంతో పాటు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందిస్తూ వచ్చాడు. కానీ పుష్ప 2కి డిఎస్పి పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయారు. ఖాళీ లేకపోవడం, లేదా వర్క్ సుక్కుకి నచ్చలేదో.. మరేదూన కారణమో తెలియదు కానీ.. ఈ క్రమంలోనే రిలీజ్ ముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కోసం థమన్, సామ్ సిఎస్, అజినీష్ లోక్‌నాథ్ ఈ ముగ్గురిని కూడా తీసుకున్నాడు సుక్కుమార్.
అయితే ముగ్గురు కొన్ని సీన్లకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించగా.. చివరకు థమన్, అజినిష్ మ్యూజిక్‌ను పక్కనపెట్టి.. సామ్ సిఎస్ ఇచ్చిన మ్యూజిక్‌ని కొన్ని సన్నివేశాల కోసం వాడుకున్నాడు సుక్కు. దీనిపై డిఎస్పి తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఓ ఈవెంట్లో షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతని పట్టుదల వల్లే టైటిల్ కార్డ్స్‌లోను.. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డీఎస్పీ అని స్పెషల్ గా వేయించుకున్నాడని టాక్ కూడా నడిచింది. ఇక సామ్ సిఎస్‌కు అడిషనల్ బిజిఎం అనే క్రెడిట్ ను అందించారు. అయితే సినిమాల్లో చాలా వరకు డిఎస్పి స్కోర్ వాడారని.. పరిమితంగా కొన్ని సన్నివేశాలకే సామ్ సిఎస్ వర్క్ ను తీసుకున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
టైటిల్ కార్డ్స్ చూసిన ఇదే విషయం క్లియర్ గా తెలుస్తుంది. కానీ.. సామ్ మాత్రం సినిమాలో 90% సన్నివేశాలను తన స్కోర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇది నమ్మశక్యంగా లేదని.. తన వర్క్ క్రెడిట్ ను పెంచుకోవడానికి ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సామ్ మళ్ళీ ఇప్పుడు రంగంలోకి దిగాడు. పుష్ప 2 కోసం తాను ఎంత వర్క్ చేసింది చూపించడానికి అన్నట్లు.. ఈ సినిమా నుంచి ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. దీంతో మళ్ళీ పుష్ప 2 బిజిఎం గొడవ రాజుకుంటుంది. మరి ఈ సినిమాలో ఉపయోగించిన తన పనిని.. ఓఎస్టి రూపంలో సామ్ రిలీజ్ చేస్తాడా.. లేదా తాను టీంకు పంపిన ట్రాక్స్ రిలీజ్ చేస్తాడా.. అనేది వేచి చూడాలి.