టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటవరసలుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య ఇటీవల హీరోయిన్ శోభితా ధూళిపాళను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. కేవలం అక్కినేని కుటుంబం, అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకకు హాజరైన బంధుమిత్రులంతా వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు అక్కినేని హీరో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.
గతంలోనే అక్కినేని అఖిల్, జైనబ్ రావిడ్జ్ నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున, అమల అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్ళిద్దరి వివాహాన్ని కూడా మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్లు సమాచారం మార్చి 24న అఖిల్ జాయినబ్ మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీళ్ళ వివాహం మొదట డెస్టినేషన్ వెడ్డింగ్‌గా భావించారని.. కానీ ఇప్పుడు అఖిల్ కూడా అన్న నాగచైతన్య బాటలోనే ఇక్కడే వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.
చైతు, శోభిత వివాహ వేదికైన అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగాన్నే వీళ్ళ పెళ్లిని కూడా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. కుటుంబ సభ్యులు కూడా దీనికి అంగీకరించారని.. అన్నపూర్ణ స్టూడియోతో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఎమోషనల్ బాండింగ్ తో.. అఖిల్, జాయినాబ్‌ల వివాహం కూడా ఇక్కడే జరిపేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారుతుంది.