టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. గత కొద్ది సంవత్సరాలుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. చివరిగా సెటాడెల్ హాని.. బని..లో యాక్షన్స్ సన్నివేశాలతో మెప్పించింది. ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలలో నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. సవాలుగా అనిపించే సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. అలాగే రాజ్ అండ్ డీకేతో కలిసి వర్క్ చేయడానికి కారణాన్ని షేర్ చేసుకుంది.
సాధారణంగా చాలా సినిమాలు అంగీకరించవచ్చు కానీ.. నా లైఫ్ లో ప్రతి దాన్ని చివరిదాని గానే భావించే దశలో ఉన్నా. ఈ క్రమంలోనే కచ్చితంగా ఆడియన్స్ పై ప్రభావాన్ని చూపించే సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుని నటిస్తున్న. 100% నేను నమ్మకపోతే ఆ సినిమాను చేయలేను. అందుకే పూర్తిగా నమ్మకం కలిగిన కథలను మాత్రమే తీసుకుంటున్న అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇక రాజ్ అండ్ డీకేతో ఎక్కువగా పనిచేయడానికి కూడా కారణం ఇదేనని.. వాళ్ళు ఎక్కువగా అడ్వెంచరస్ అనిపించే పాత్రలనే డిజైన్ చేస్తున్నారు. వారితో కలిసి పని చేయడం నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది.. నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎక్కువగా వాళ్ళు రూపొందిస్తున్నారు. గొప్ప సినిమాల్లో నటించానని భావన రాకపోతే నేను పనిచేయలేను అంటూ సమంత చెప్పుకొచ్చింది.
ఇక సమంత ఇప్పటివరకు రాజ్ అండ్ డీకె డైరెక్షన్‌లో ఫ్యామిలి మెన్ ఎబ్ సిరీస్‌తో పాటు.. సిటాడెల్ హనీ.. బనీలో నటించిన సంగతి తెలిసిందే. కాగా సిటాడెల్ సిరీస్ సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రెస్టీజియస్ అవార్డుగా భావించే క్రిటిక్ ఛాయిస్ అవార్డుకు.. ఉత్తమ విదేశీ లాంగ్వేజ్ మూవీ నామినేషన్స్ లో సెలెక్ట్ అయింది. ఇక ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో రక్త బండార్ సిరీస్ తో పాటు.. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి పలు సినిమాలను తెరకెక్కించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సమంత తన బ్యానర్‌లోనే మా ఇంటి బంగారం టైటిల్‌తో ఓ సినిమా నటించనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. చాలా కాలం నుంచి ఈ సినిమాపై ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను సమంత వెల్లడించనుందట.