టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి డెబ్యూ మూవీ.. గాంధీ తాత చెట్టు తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది గంటల క్రితం గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాకు.. నిన్నే స్పెషల్ షూస్ పడ్డాయి. ఈ క్రమంలోనే సినిమా అదిరిపోయిందని.. మంచి సందేశాత్మక సినిమా అంటూ.. ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. స్పెషల్‌షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. సుకృతి వేణి ఫస్ట్ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
గాంధీ తాత చెట్టు సినిమాపై మహేష్ బాబు ఎక్స్ వేదికగా రియాక్ట్ అవుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. సుకృతి వేణి గాంధీ పాత్రలో లీనమైపోయిందని.. తన ఫస్ట్ సినిమాలోనే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందని.. ఎమోషనల్ సీన్స్ తోనూ మెప్పించింది అంటూ ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న క్రమంలో.. మహేష్ బాబు సినిమాపై చేసిన కామెంట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక మహేష్.. ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ ఈ సినిమా మీతో పాటే ఉండిపోతుందని వెల్లడించాడు. అహింస గురించి పదునైన కథను దర్శకురాలు పద్మ మల్లాది ఎంతో అద్భుతంగా రూపొందించింది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక చిన్నారి నేస్తం సుకృతి వేణి శక్తివంతమైన ప్రదర్శనతో ఎంతో గర్వపడేలా చేసిందని చెప్పుకొచ్చాడు. ఈ కళాఖండాన్ని కచ్చితంగా అంతా చూసి తీరాలని ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. మహేష్ బాబు స్వయంగా ఓ సినిమాకు ఈ రేంజ్ లో ప్రశంసలు కురిపించడంతో.. సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు.. సాధారణ ఆడియన్స్‌లోను ఆసక్తి నెలకొంది. ఇక సినిమా రిలీజ్‌కు ముందే పలు నేషనల్ స్క్రీన్ లపై ప్రదర్శించబడి ఎన్నో నేషనల్ అవార్డులను తెచ్చిపెట్టింది. సుకృతి వేణి నటనకు కూడా ఉత్తమ బాలనటిగా పలు అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కమర్షియల్ గా సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఏ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతుందో వేచి చూడాలి.