టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ నెంబర్ వన్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. అంచలంచలుగా ఎదుగుతూ నటుడిగా సత్తా చాటుకున్న చిరు.. ఏడుపదుల వయసులోనూ యంగ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. తన నటనతో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయడం కామన్. ఆ సినిమాలు ఒక్కోసారి డిజాస్టర్లుగా నిలిస్తే.. మరి కొన్నిసార్లు అంచనాలకు వ్యతిరేకంగా బ్లాక్ బస్టర్‌లు అఅవుతాయి. అలా గతంలో చిరు రిజెక్ట్ చేసిన ఒక కథతో అప్పటి వరకు టాలీవుడ్‌లో విలన్‌గా మెరిసిన ఓ నటుడు హీరోగా మారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడట.
దాంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోగా మారి చిరుకే గట్టి పోటీ ఇచ్చాడంటూ ఓ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. చిరు రిజెక్ట్ చేసిన ఆ స్టోరీ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. మొదట తన సినీ కెరీర్‌లో కరుడుగట్టిన విలన్ పాత్రలో నటించి మెప్పించిన మోహన్ బాబు తర్వాత పలు పాజిటివ్ రోల్స్ లో.. అలాగే సెకండ్ హీరోగాను ఆకట్టుకున్నాడు. ఇలాంటి క్రమంలో హీరోగా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి కే. రాఘవేంద్రరావు డైరెక్షన్లో అల్లుడుగారు సినిమాలో హీరోగా నటించిన ఛాన్స్ కొట్టేశాడు. తర్వాత రౌడీ మొగుడు సినిమాలోని హీరోగా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికీ లీడ్ రోల్స్, విలన్ రోల్స్‌లో నటిస్తూనే ఉన్న మోహన్ బాబు.. 1991లో సోలో హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.
అదే అసెంబ్లీ రౌడీ మూవీ. బి. గోపాల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మొదట చిరంజీవి నటించాల్సి ఉందట. కానీ.. చిరు కథ నచ్చినా.. డేట్స్ బిజీగా ఉండడంతో సినిమాను వదులుకున్నారు. ఈ క్రమంలోనే బి.గోపాల్ కథను మోహన్ బాబుకు చెప్పడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ వేలై కీడైచుడుచు సినిమాకు రీమేక్‌గా.. ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేసి బి. గోపాల్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్గా కనిపించింది. కాగా సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో మోహన్ బాబుకు వరుసగా హీరో అవకాశాలు రావడంతో.. అప్పటివరకు విలన్ పాత్రలో నటించిన ఆయన తర్వాత కేవలం హీరోగానే సినిమాలు చేస్తూ.. చిరుకి కూడా గట్టి పోటీ ఇచ్చాడు.