నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ పేరుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య పేరు వింటేనే అభిమానుల్లో పూనకాలు మొదలై పోతాయి. ఇక దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. 60 ఏళ్ళు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌తో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. అలా ఇప్పటివరకు బాలయ్య సినీ కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాలో ఏంటో ఒకసారి చూద్దాం.
డాకు మహారాజ్:
యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్‌లో బాలయ్య నుంచి చివరిగా వచ్చిన డాకు మహారాజ్ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలోనే బాలయ్యకు 2025 మెమరబుల్ సంక్రాంతి ట్రీట్ ఇచ్చిన ఈ సినిమా రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఇక సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల కలెక్షన్లకు చేరువలో నిలిచి హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. కాగా సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి ఏ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొడుతుందో వేచి చూడాలి.
వీర సింహారెడ్డి:
బాలయ్య హీరోగా.. గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా రూ.85 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా.. బాలయ్య ఈ సినిమాతో నట విశ్వరూపం చూపించాడు. మరో సమరసింహారెడ్డి రేంజ్లో ఈ సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. దీంతో వరల్డ్ వైడ్ గా రూ.132 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టి.. రూ.80 కోట్ల వరకు షేర్ వశూళను రాబట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. అంతేకాదు.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ తోనే రూ.73 కోట్లు అందుకోవడం విశేషం.
అఖండ:
బాలయ్య కెరీర్‌లో వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్న సమయంలో సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చిన సినిమా అఖండ. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా కేవలం రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొంది.. వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.132 కోట్ల వసూళ్లను సాధించింది. బాలయ్య కెరీర్‌లోనే కలెక్షన్ల విషయంలో రూ.100 కోట్లు దాటిన మొదటి సినిమాగా ఈ సినిమా రికార్డును క్రియేట్ చేసింది. ఆఖండ గా బాలయ్య నటతాండవం ఆడియన్స్ కు పూనకాలు తెప్పించింది. ఈ క్రమంలో సినిమా సీక్వెల్‌గా అఖండ 2 తాండవం రూపొందుతుంది.
భగవంత్ కేసరి:
బాలయ్య సినిమాల్లోనే ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కిన ఈ మూవీ భగవంత్‌కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ డాటర్ సెంటిమెంట్ మూవీ ఆడియన్స్‌లో మంచి టాక్ సంపాదించుకుంది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లతోనే రూ.127 కోట్లు కొల్లగొట్టింది. అలా వరల్డ్ వైడ్ షేర్ వసూళు రూ.70.1 కోట్లు సాధించగా.. రూ.67 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
గౌతమీపుత్ర శాతకర్ణి:
బాలయ్య కెరీర్‌లో హిస్టారికల్ సినిమాగా వచ్చి మంచి సక్సెస్ సాధించుకున్న వాటిలో గౌతమీపుత్ర శాతకర్ణి కూడా ఒకటి. ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపం అందరినీ ఆకట్టుకుంది. రూ.45 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.81.6 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. రూ.51 కోట్ల షేర్ రాబట్టుగా.. రూ.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకోవడం విశేషం. క్రిష్ దర్శకుడుగా వ్యవహరించిన ఈ హిస్టారికల్ మూవీ.. బాలయ్య కెరీర్‌లోనే మైల్డ్ స్టోన్ గా నిలిచింది.
లెజెండ్:
బాలయ్య లక్కీ డైరెక్టర్గా బోయపాటికి ఎలాంటి ఇమేజ్ ఉందో తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు కాంబోలో తెరకెక్కిన లెజెండ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం రూ.35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.68 కోట్ల కలెక్షన్లను కలగొట్టింది. రూ.48 కోట్ల షేర్ కలెక్షన్ల పరంగా దాదాపు రూ.32 కోట్ల రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం.
సింహ:
ఈ సినిమా కూడా బాలయ్య ప్లాప్‌తో సతమతమవుతున్న సమయంలోనే రూపొంది మంచి సక్సెస్ అందుకుంది. బోయపాటి శీను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌లో రూపొంది.. ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. రూ.30 కోట్లకు షేర్ వసూళు రాబట్టగా రూ.16 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
జై సింహా:
బాలకృష్ణ హీరోగా కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుని కమర్షియల్‌గా మంచి లాభాలను కొల్లగొట్టింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.52 కోట్ల కలెక్షన్లు సాధించింది. షేర్ వవూళ్ళు రూ.30.4 కోట్లు కాగా.. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.26 కోట్లు జరుపుకుంది.
నరసింహనాయుడు:
బాలయ్య కెరీర్‌లోనే నరసింహనాయుడు సినిమా ఎప్పుడు స్పెషల్ స్థానాన్ని సంపాదించుకుంది. సమరసింహారెడ్డి ప్రభంజనం తర్వాత వచ్చిన నరసింహనాయుడు సినిమాకి కూడా అదే రేంజ్‌లో హైప్ నెలకొంది. కేవలం రూ. 7కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా 25 ఏళ్ల క్రితమే రిలీజై విపరీతంగా కలెక్షన్లు సాధించింది. అప్పట్లోనే రూ.38 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిందంటే.. మామూలు విషయం కాదు. రూ.20 కోట్లకు పైగా లాభాలు దక్కించుకున్న ఈ సినిమా రూ.8 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
ఎన్టీఆర్ కథానాయకుడు:
నందమూరి నటసార్వభౌమ తారక రామారావు బయోపిక్ సినిమాలలో ఒక భాగం ఎన్టీఆర్ కథానాయకుడు. తన తండ్రి పాత్రలో బాలయ్య నటనతో ఆకట్టుకున్నాడు. కృష్ణుడుగా వ్యవహరించిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా మంచి లాభాలు తెచ్చి పెట్టింది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.39 కోట్లు కాగా.. వరల్డ్ వైడ్ షేర్ రూ.20 కోట్లు. ఇక ఫ్రీ రిలీజ్ బిజినెస్‌తోనే రూ.70 కోట్లు దక్కించుకుంది.