పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాల లైనప్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆ లిస్టులో ప్రభాస్, సందీప్ రెడ్డివంగ కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ కూడా ఒకటి. మోస్ట్ అవైటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు.. సంగీత దర్శకుడుగా హర్షవర్ధన్ రామేశ్వరమ్ పనిచేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్కర్ తో బిజీగా ఉన్నా సందీప్.. హర్షవర్ధన్‌తో కలిసి మ్యూజిక్ సీటింగ్ను కూడా మొదలుపెట్టేసాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్లో కొనసాగుతున్నాయి. ఇలాంటి క్రమంలో స్టార్ కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో బిజీగా గడుపుతున్నాడు సందీప్. కాగా.. ఈ సినిమాలో విలన్‌గా ఎవరూ అనే దానిపై కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నసంగతి తెలిసిందే.
మొదటి విలన్ గా కొరియన్ నటుడు డోంగ్ లీ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపించగా.. డాంగ్‌లీ కూడా తన ఇన్‌స్టాలో ప్రభాస్ సలార్ పోస్టర్ షేర్ చేయడంతో స్పిరిట్ విలన్ తనే అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి క్రమంలో లేటెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాలో విలన్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై స్పిరిట్ మేకర్స్ తాజాగా రియాక్ట్ అయ్యారు. అదంతా ఫేక్ అని.. వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. వరుణ్ తేజ్‌ను విలన్‌గా తీసుకునే డిస్కషన్ రాలేదని కొట్టి పడేశారు.
ఈ సినిమా సమ్మర్ లో సెట్స్‌పైకి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు.. సందీప్ రెడ్డి స్కెడ్యూల్ ని ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఇక ఇప్పటికే సందీప్ జకార్త లొకేషన్ వేట పూర్తి చేశాడట. మరోసారి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో జకార్తా వెళ్లి లొకేషన్స్ ఫైనల్ చేసుకొనున్నాడని.. త్వరలోనే ఇండియాలో మొత్తం షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడని వెల్లడించారు. అతి త్వరలో సందీప్ నుంచి స్పిరిట్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా రాజాసాబ్ సినిమాను పూర్తి చేసి.. ఫౌజి సినిమాతో పాటు స్పిరిట్‌ను ట్రాక్‌లో పెట్టాలన్నీ ప్లాన్ చేస్తున్నాడట ప్రభాస్. ఏదేమైనా స్పిరిట్ మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు ఫ్యాన్స్.