అఖండ 2 లో ఆ గోల్డెన్‌ బ్యూటీ.. ఇక బొమ్మ బ్లాక్ బాస్టర్ పక్కా..!

నందమూరి నట‌సింహం బాఅకృష్ణ‌ – బోయపాటి శ్రీను కాంబో మూవీ అంటే ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్‌ పక్కా అనే రేంజ్‌లో మాస్ వైబ్ క్రియేట్ అవుతుంది. అలా ఇప్పటికే వీళ్ళ కాంబోలో మూడు సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ కాగా.. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. అఖండ 2 తాండవం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపించిన ఈ సినిమా ఫ్లాప్‌లలో కూరుకుపోయిన‌ బాలయ్య‌ను హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే సినిమా సెకండ్ పార్ట్ పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా.. సినిమా షూట్ ప్రారంభించారు. మొదటి రోజు నుంచి బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ మొదలవడం విశేషం.

Akhanda 2 - Thaandavam': Nandamuri Balakrishna's next with Boyapati Sreenu launched - The Hindu

బాలయ్య, బోయపాటి కాంబోలో నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం గ్రాండ్ లెవెల్‌లో ఉండబోతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. అలా.. తాజాగా మరో ఇంట్రస్టింగ్ అప్డేట్‌ను రివిల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో అందాల భామ సంయుక్త కీలకపాత్రలో కనిపించనుందని అఫీషియల్ గా ప్రకటించారు. తెలుగులో భీమ్ల నాయక్, విరూపాక్ష లాంటి బ్లాక్ బ‌స్టర్లు ఇచ్చిన సంయుక్త ఇప్పుడు బాలయ్య స‌ర‌సన కీలక పాత్రలో కనిపించనుంది. ఈ కథకు సంయుక్త రోల్ చాలా స్పెషల్ గా ఉండబోతుందని సినీవర్గాలు వెల్లడించాయి. ఇక ఇటీవల కాలంలో సమ్యుక్త‌ నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్‌లపరంగా దూసుకుపోయింది.

ఈ క్రమంలోనే అమ్మడికి గోల్డెన్ బ్యూటీగా మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పటికే సాలిడ్ బజ్‌ క్రియేట్ చేసుకున్న అఖండ 2లో ఆమె నటిస్తుండటంతో ఈసారి సినిమా బ్లాక్ బస్టర్ పక్క అంటూ.. కలెక్షన్లతో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక థ‌మన్ తన మ్యూజిక్‌తో బాలయ్యను మరో రేంజ్‌లో ఎలివేట్ చేస్తాడు. ఈ క్రమంలోనే అఖండ 2కు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా థ‌మ‌న్‌ వ్యవహరిస్తున్నాడు. రామ్ అచంటా, గోపి ఆచంటా సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో మూవీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. బాలయ్య మాస్ మార్క్ మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ఆఖండ 2 తో బోయపాటి మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేస్తాడో.. లేదో.. ఏ రేంజ్ లో సినిమా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.