బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై తాజాగా జరిగిన దాడి కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. దాడికి అతని భార్య కరీనా కపూర్ కుట్ర చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన జరిగినా తీరు.. కరీనా కపూర్ చెబుతున్న విషయాలు కొత్త అనుమానాలు రేపుతున్నాయట. ఈ క్రమంలోనే కేసును వివిధ కోణాలు దర్యాప్తు చేయడం ప్రారంభించారు పోలీసులు. దానికి ముందు కరీన తన సిస్టర్‌తో కలిసి పార్టీ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది కరీనా. ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరుకున్న కరీనా.. సైఫ్ పై దాడి జరుగుతున్న సమయంలో కూడా అక్కడే ఉంది. కానీ.. సైఫ్ పై దాడి జరిగిన తర్వాత పోలీసులకు కరీనా ఇచ్చిన సమాచారం.. ఘటన జరిగిన తీరును పోల్చి చూస్తే రెండింటికి ఎక్కడ మ్యాచ్ కావడం లేదని పోలీసులు వెల్లడించారు.
ఇంట్లోకి ఓ వ్యక్తి ప్రవేశించడానికి, పనిమనిషి పై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అతని ప్రతిఘటించే క్రమంలోనే సంఘటన జరిగినట్లు కరీనాతో పాటు.. వాళ్ళ పనిమనిషి కూడా వెల్లడించింది. ఇక దాడికి ప్రయత్నించిన షరీఫ్ ఉల్ల అనే వ్యక్తిని గదిలో బంధించామని.. అతని తప్పించుకుని పారిపోయాడని వాళ్ళు పోలీసులకు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కరీనాతో పాటు.. వల్ల పనిమనిషిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి తర్వాత పోలీసులు సీన్ కంస్ట్రక్ట్ చేసిన టైంలో.. చెప్పిన విషయాలు, అక్కడ ఘటన జరిగిన తీరు.. రెండిటికి పొంతన లేకపోవడంతో పోలీసులు అనుమానానికి బలం చేకూరింది. దాడి టైంలో అక్కడ ఉన్న కరీనా, పనిమనిషి ఇద్దరినీ వేరువేరుగా విచారించిన తర్వాత మరోసారి ఇద్దరినీ ఒకేచోట కూర్చోపెట్టి విచారించి మరిన్ని కొత్త విషయాలు బయటకు తీసుకువచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే ముఖ్యంగా పోలీసులు అనుమానిస్తున్న అంశాలు అత్యంత భద్రత కూడిన అపార్ట్మెంట్‌లో ఫ్యామిలీ, అక్కడ పనిచేసే వారి ప్రమేయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించడం సాధ్యం కాదు. ఇక ఇంట్లోకి వచ్చిన ఆ వ్యక్తిని గదిలో బంధించామని వీళ్ళు చెప్తున్నారు. ఆ గది నుంచి అంత సులువుగా వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు. గాయపడిన సైఫ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లే టైంలో ఆటోలో అతని కూర్చోబెట్టి.. కరీనా పనిమనిషితో మాట్లాడుతూ కూర్చుంది. సైఫ్‌తో పాటు.. హాస్పిటల్‌కి వెళ్ళకుండా.. ఏడేళ్ల కొడుకుని ఇచ్చి లీలావతి హాస్పిటల్‌కు పంపించింది. ఈ అంశాలన్నీ పోలీసులు ప్రధానంగా తీసుకున్నారు. మరిసటి రోజు మధ్యాహ్నం వరకు కరీనా హాస్పిటల్ కి రాకపోవడం మరింత కీలక అంశంగా మారింది. ఈ క్రమంలోనే ఈ దాడి మొత్తానికి ప్రధాన సూత్రధారి కరీనా కపుర్ అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారట. ఇక ప్రస్తుతం కేసు దర్యాప్తు క్రమంలో సైఫ్, కరీనా జీవితంలో వెలుగులోకి రాని అంశాలు ఎన్నో దాగి ఉన్నాయని సందేహాలు అందరిలో మొదలయ్యాయి.