టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సమంత.. ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలు పరంగా భారీ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ఇక సమంత లైఫ్ తెరిచిన పుస్తకమే. ఆమె లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాదు.. మయోసైటిస్ అనే భయంకర వ్యాధితో చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ట్రీట్మెంట్ కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చి మరి విదేశాల్లో గడిపింది. అయితే ఇలాంటి కష్ట సమయంలో సమంతకు అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే అండగా నిలిచారని చెప్పుకొచ్చిన ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ లో చాలా స్పెషల్ వ్యక్తి రాహుల్ అని.. గొప్పగా తన పాత్రను నిర్వర్తించడంటూ వివరించింది. 17 ఏళ్ల ఫ్రెండ్షిప్ ను గుర్తు చేసుకుంటూ రాహుల్ తనకు ఎంత స్పెషల్ అని వివరించింది. మయోసైటిస్ టైంలో అతను ప్రతిరోజు నన్ను పరామర్శించేందుకు వచ్చేవాడని.. చాలా సమయాన్ని సరదాగా గడిపేవాడని.. నాతో ఆటలు ఆడిస్తూ ఆలోచనల నుంచి తప్పించి.. ఉల్లాసంగా ఉండేలా చేసేవాడని చెప్పుకొచ్చింది.
అదే టైంలో నా ఇంటికి ప్రతిరోజు వచ్చి నన్ను ఆటలతో ఎంటర్టైన్ చేస్తూనే.. నాకు మళ్ళీ పని చేసే ఉత్సాహాన్ని కల్పించాడు అంటూ చెప్పుకొచ్చింది. రాహుల్ లాంటి స్నేహితులు జీవితంలో దొరకడం నిజంగా అదృష్టమని.. తన అభిప్రాయాన్ని సమంత వెల్లడించింది. కెరీర్ ప్రారంభంలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయితో మంచి బాండింగ్ ఏర్పరచుకుంది సమంత. తను నటించిన ఎన్నో సినిమాలకు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయి వ్యవహరించింది. ఈ క్రమంలోనే వీరి మధ్య స్నేహం బలపడింది. ఇప్పటికీ ఆ స్నేహం అంతే స్ట్రాంగ్ గా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక ఇటీవల ఆ వ్యాధి నుంచి కోల్కొన్న సమంత.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతుంది. వ్యక్తిగత లైఫ్‌లోను చాలా సమర్థవంతంగా రాణిస్తుంది.