టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమా లైన్ అఫ్ తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో పాటు హనురాగవపూడితో.. ఫౌజి సినిమా చేయనున్నాడు. అయితే ఇంకా ఈ రెండు సినిమాల షూట్ పూర్తి కాకముందే.. మరో సినిమాను ప్రభాస్ స్టార్ట్ చేయనున్నాడని.. సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి అంటూ తెలుస్తుంది.
ఈ నేపద్యంలోనే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక కేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. త్వరలోనే స్పిరిట్ ప్రారంభం కానుందని.. దానికి సంబంధించిన లొకేషన్ అన్వేషణలో డైరెక్టర్ బిజీగా ఉన్నారని.. జకార్తా, ఇండోనేషియాలో మొదటి షెడ్యూల్ ప్రారంభించాలని ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే సందీప్ రెడ్డివంగ తన ఆ డైరెక్టర్ తో కలిసి మరోసారి జకర్త వెళ్ళనున్నాడట. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ప్రభాస్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు.
అయితే మొదట నెగిటివ్ షేడ్స్‌లో ఉన్నా.. తర్వాత పాజిటివ్ గా ప్రభాస్ రోల్ టర్న్ అవుతుందని సమాచారం. అంతేకాదు ఈ మూవీ బ్యాక్ డ్రాప్ ఇప్పుడు ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ కథ నడుస్తుందని సమాచారం. ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా గురించి ఇందులో చూపించనున్నారని.. పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ ఈ మాఫియా పై ప్రబాస్ పోరాటం చేస్తాడని టాక్. ఇందులో భాగంగానే సినిమాను గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేస్తూ రూపొందించనున్నడట సందీప్. ఇందులో వాస్తవం ఎంత తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ ఆడియన్స్‌లో ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.