ఇండస్ట్రీలో ఓ సినిమా తెరకెక్కాలంటే దానికి బడ్జెట్ కీలకం. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు, భారీ బడ్జెట్‌తో రూపొందించే సినిమాలు పెద్ద సినిమాలు. కొత్త నటులు, చిన్న సెలబ్రిటీలతో తక్కువ బడ్జెట్ లో రూపొందించే సినిమాలను చిన్న సినిమాలు అంటూ పిలుస్తూ ఉంటారు. అయితే చిన్న సినిమాలని పిలిచే ఎన్నో సినిమాలు.. ఇప్పటికే టాలీవుడ్ వద్ద దిమ్మతిరిగే కలెక్షన్లతో సంచలనాలు సృష్టించాయి. అల టాలీవుడ్‌లో 20వ శతాబ్దంలో అది తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి అత్యధిక కలెక్షన్లు కల్లగొట్టిన సినిమాలేంటో ఒకసారి చూద్దాం.
చిత్రం:
ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన ఈ సినిమాకు.. రామోజీరావు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఆయన ఈ సినిమా కోసం సాహసం చేశాడనే చెప్పాలి. రూ.45 లక్షలతో నిర్మించిన ఈ సినిమా.. 2000 సంవత్సరంలో రిలీజై మంచి సక్సెస్ సాధించింది. అంతేకాదు కోట్లల్లో కలెక్షన్లు రాబట్టి చిన్న సినిమాల నిర్మాతలకు ఇన్స్పిరేషన్‌గా మారింది.
ఆనంద్:
టాలీవుడ్ టాలెంట్ డైరెక్టర్లలో ఒకరైన శేఖర్ కమ్ముల.. ఈ సినిమాతోనే మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారాడు. ఆడియన్స్ లో మంచి కాఫీలాంటి సినిమాగా ఎప్పటికీ ఈ మూవీ గుర్తుండిపోతుంది. రెగ్యులర్ ఫార్మాట్ ను పక్కనపెట్టి.. అతి తక్కువ బడ్జెట్ తో క్రియేటివ్‌గా రూపొందించిన సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహించే నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్.. మొదటి సారి ఆర్థిక సహాయం అందించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.
హ్యాపీ డేస్:
శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బ్లాక్ బస్టర్గా నిలిచిన మరో సినిమా హ్యాపీ డేస్. వరుణ్ సందేశ్ హీరోగా, తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్లో వర్షం కురిపించింది. లెక్కలేనన్ని అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
అష్టా చమ్మ:
నేషనల్ స్టార్ నాని, కలర్స్ స్వాతి జంటగా నటించిన ఈ సినిమాకు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. అతి తక్కువ బడ్జెట్ తో వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచి.. కలెక్షన్ల వర్షం కురిపించింది.
అలా మొదలైంది:
నాని, నిత్య మీనన్ జంటగా నటించిన ఈ మూవీ రిలీజ్ అయిన ప్రారంభంలో.. చిన్న సినిమాల జాబితాలో కలిసిపోతుంది అని అంతా భావించారు. కానీ.. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసి పెద్ద సినిమాల కంటే గొప్ప స్థాయిలో నిలబడింది. రూ.25 కోట్ల వాసులు చేసి ట్రేడ్ వర్గాలకే షాక్ కలిగించింది.
ఉయ్యాల జంపాల:
బావ, మరదళ్ల మధ్య జరిగే ఓ ప్రేమకథను రొటీన్ గా కాకుండా.. ఫ్రెష్ ఫీల్ కలిగేలా వర్మ క్రియేటివ్‌గా రూపొందించారు. ఇక ఈ సినిమా కథ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
ఊహలు గుసగుసలాడే:
స్టార్ నటుడు అవసరాల శ్రీనివాస్ డైరెక్టర్ గా మారి.. తెరకెక్కించిన ఈ మూవీ స్క్రీన్ ప్లే తోను మ్యాజిక్ క్రియేట్ చేసింది. కేవలం రూ.2.5 కోట్లతో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.27 కోట్లు రాబట్టి.. అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించింది. అతి తక్కవ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఈ రేంజ్‌లో కలెక్షన్లు కలగొట్టడం విశేషం.
క్షణం:
అడవి శేష్ హీరోగా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అతి తక్కువ బడ్జెట్ తో వచ్చి సంచలన సక్సస్ సాధించింది. అద్యంతం ట్విస్ట్‌లు, మలుపులతో కొనసాగిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే కేవలం కోటి రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా.. రూ.8 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కథల్లో కంటెంట్ ఉంటే ఎలాంటి హీరో సినిమా అయినా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అని టాలీవుడ్ చాటి చెప్పింది.
పెళ్లిచూపులు:
విజయ్ దేవరకొండ, రీతు వర్మ హీరో, హీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు.అతి తక్కువ బడ్జెట్‌తో ఎంతో అద్భుతంగా రూపొందించాడు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు.. చిన్న సినిమాల నిర్మాతలకు గొప్ప ఇన్స్పిరేషన్‌గా నిలిచింది.
హనుమాన్:
గతేడాది తేజ సర్జ హీరోగా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. తక్కువ బడ్జెట్‌తో బచ్చిన ఈ మూవీ గ్రాండ్ విజువల్స్, కంటెంట్ ప్రేక్షకులను వేరే లెవెల్‌లో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే కలెక్షన్ల పరంగా పాన్ ఇండియా లెవల్‌లో హనుమాన్ సంచలనాలు సృష్టించింది.