గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి రిలీజ్ అయిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజై.. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచి ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా మిగిలిపోయింది. అయితే.. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన దిల్ రాజు.. ఇప్పటివరకు సినిమాపై రియాక్ట్ కాకున్నా భవిష్యత్తులో ఈ సినిమా తెచ్చిన నష్టాల పై రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాగా చరణ్ కు క్లీంకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి.
ఈ క్రమంలోనే కింకార మెగా కుటుంబానికి లక్కీ చాంప్ అంటూ కామెంట్లు కూడా వినిపించాయి. ఇలాంటి క్రమంలో గేమ్ ఛేంజర్ సినిమా ప్లాప్టాప్ కావడంతో.. క్లీంకార లక్కీ సెంటిమెంట్ కూడా చరణ్ సినిమా ఫ్లాప్ నుంచి తప్పించలేకపోయిందని.. పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఫుల్ రన్ లో రూ.110 కోట్ల వరకు షేర్ కొలగట్టే అవకాశం ఉందట. ఒకవేళ ఈ మేర కలెక్షన్లు సాధించినా.. దిల్ రాజుకు దాదాపు రూ.125 కోట్ల రేంజ్ లో నష్టాలు తప్పవని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది.
ఇక ఓ భారీ బడ్జెట్ సినిమాకు ఈ రేంజ్‌లో నష్టాలు రావడం సాధారణ విషయం కాదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్‌తో ఇప్పటికే థియేటర్ పూర్తిగా తగ్గిన సంగతి తెలిసిందే. కాగా.. అమెజాన్ ప్రైమ్ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఎకింత భారీగా ఖర్చు చేసి మరీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుందట. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.