మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. తాజాగా దేవరతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తారక్ ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తర్వాత తారక్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. ఇంకా సెట్స్ పైకి రాని ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఐదు కంటే ఎక్కువ భాషల్లో మూవీ రిలీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇక ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ రూ.50 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్. చివరిగా ప్రశాంత్.. ప్రభాస్ హీరోగా రూపొందించిన సలార్ కేవలం రూ.270 కోట్లతో తెరకెక్కి.. మేకర్స్ హెంబలెఫిలిమ్స్ కు భారీ లాభాలను తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్ సినిమా కోసం ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్ను కేటయించడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. అంతేకాదు తారక్ సినీ కెరీర్‌లోనే సోలో హీరోగా తెరకెక్కనున్న హై బడ్జెట్ సినిమా కూడా ఇదే.
ఈ సినిమా కథను నీల్ చాలా సంవత్సరాల క్రితమే సిద్ధం చేసుకున్నాడని.. బడ్జెట్ సమస్యల కారణంగా ఇంతకాలం ఎదురుచూడాల్సి వచ్చిందని.. ఇప్పుడు ఆ సమస్యను అధిగమించిన ప్రశాంత్.. తారక్ తో సినిమాను ప్లాన్ చేశాడట. ఇక తారక్ చాలాకాలంగా క్రేజీ ప్రాజెక్టులకు ఓట్లు వేస్తూ కెరియర్ పరంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తారక్, ప్రశాంత్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాల్లో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ కనిపించనుంది. కాగా ఈ సినిమాలో 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో.. సినిమా రిలీజై రూ.1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమని.. తారక్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తాడంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.