గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తాజాగా గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నిరాశ పరచడంతో తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు చరణ్. బుచ్చిబాబు సన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. కాగా ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రానున్న సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నయి. ఇలాంటి క్రమంలో RC 17 కి హీరోయిన్ ఫిక్స్ అయిందంటూ ఓ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం చరణ్ వరస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు.
ఈ క్రమంలోనే సినిమాలో నటించే హీరోయిన్లు కూడా అదే రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే చెర్రీ వరుసగా స్టార్ హీరోయిన్లతో జతకడుతున్న సంగతి తెలిసిందే. కాగా త్వరలోనే సుక్కు కాంబోలో సెట్స్‌పైకి రానున్న చరణ్ సినిమా కోసం.. ఓ అదిరిపోయే బ్యూటిని ఫిక్స్ చేశాడు సుక్కు. పుష్ప 2 మూవీతో సక్సెస్ జోష్‌లో ఉన్న సుక్కు.. గతంలో చరణ్‌తో రంగస్థలం తెరకెక్కించి.. నాన్ ధియేటర్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వీళ్లిద్దరు కాంబోలో రానున్న నెక్స్ట్ సినిమా RC 17 కోసం.. సుక్కు ఏకంగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను రంగంలోకి దించనున్నాడు అంటూ టాక్ నడుస్తుంది.
ఇప్పటికే చరణ్.. బాలీవుడ్ స్టార్ బ్యూటీలతో జతకడుతున్న సంగతి తెలిసిందే. ఇ క్రమంలోనే ఆర్‌ఆర్ఆర్ సినిమాల్లో సీతా రోల్‌లో ఆలియాభట్‌తో జంటగా నటించిన చరణ్.. గేమ్ ఛేంజర్‌లో కియారాతో సందడి చేశాడు. ఇక బుచ్చిబాబు డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమాలో జాన్వి కపూర్‌తో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే సుక్కు కాంబోలో చరణ్ నటించిన సినిమాకు శ్రద్ధ పేరు వైరల్ గా మారుతుంది. ఇక ఇప్పటికే శ్రద్ధ.. ప్రభాస్‌తో సాహూ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే.. మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.