నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం సౌత్ తో పాటు.. నార్త్ లోను వరుస సినిమా ఆఫర్లను కొట్టేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తను స్టార్ హీరోయిన్గా మారడానికి ఓ విషయంలో రాజీ పడ్డానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. కుటుంబానికి సరైన సమయాన్న ఇవ్వలేకపోతున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని.. ఇక కెరీర్ విషయంలో నా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నారంటూ వివరించింది. సక్సెస్ కోసం చాలా కష్టపడాలని.. అదే సమయంలో కొన్ని విషయాలకు కాంప్రమైజ్ అవ్వక తప్పదు అంటూ వెల్లడించిన రష్మిక.. సినిమాలతో బిజీగా ఉండడంతో ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా.. అదే నేను సినీ ప్రయాణంలో కాంప్రమైజ్ అయిన అతిపెద్ద విషయం అంటూ చెప్పుకొచ్చింది.
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒకేసారి సమయాన్ని కేటాయించాలంటే అది సులభమైన విషయం కాదని.. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయక తప్పదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమాలోకి అడుగుపెట్టిన స్టార్టింగ్‌లో మా అమ్మ చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ నిలబెట్టుకోవాలంటే.. ఫ్యామిలీ టైం త్యాగం చేయక తప్పదని ఆమె నాతో అంది. ఇక నా ఫ్యామిలీని నా బలం. కీలక సమయాల్లో, ఖాళీ దొరికినప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్న. చెల్లి అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రతిరోజు మేమిద్దరం మెసేజ్లు చేసుకుంటాం. షూట్స్‌లో బిజీగా ఉండటం వల్ల.. తనతో గడిపే అమూల్యమైన సమయాన్ని మిస్ అవుతున్నా అంటూ వివరించింది.
తను ఎంతో స్మార్ట్.. రానున్న రోజుల్లో అద్భుతమైన మహిళగా మారుతుందని నమ్ముతున్న అంటూ చెప్పుకొచ్చింది. ఇక షూట్ సమయంలో కాస్త బ్రేక్ దొరికిన ఫ్యామిలీతో ఫోన్లు చేసి మాట్లాడతా అని రష్మిక వివరించింది. తాజాగా పుష్ప 2తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం చావా షూట్లో బిజీగా గడుతుంది. చత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా కనిపిస్తుండగా.. శాంభాజి భార్య ఏసుబాయిగా రష్మిక మెరవనుంది. ఫిబ్రవరి 14న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటు సికందర్, ధామ, కుబేర, గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో ఇలా వరుస సినిమాల్లో బిజీగా గడుపుతుంది రష్మిక.