ఐటీ రైడ్స్ కామన్.. అవస్తవాలను హైలెట్ చెయ్యొద్దు.. దిల్ రాజు

గత నాలుగు రోజులుగా టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లల్లో ఐటి సోదరులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయంపై నాలుగు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఈ ఐటి రైడ్స్‌పై దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. ఈ నాలుగు రోజుల నుంచి ఈ విషయంపై మీడియా చాలా ఆసక్తి కనబరిస్తుందని.. తెలిసి తెలియని విషయాలను హైలెట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యాడు. 2008లో ఒకసారి ఇలా ఐటీ రైడ్స్ జరిగాయి. మళ్లీ దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా ఇల్లు, కార్యాలయాలపై రైడ్స్ జరిగాయి అంటూ చెప్పుకొచ్చాడు. మధ్యలో మూడు సార్లు సర్వే చేసి అకౌంట్ బుక్లు చెక్ చేశారని.. వ్యాపార రంగంలో ఉన్నవారికి.. ఇలాంటి దాడులు చాలా కామన్ అంటూ వివరించాడు.

ఒక ఈ రైడ్స్‌లో మా ఇంట్లో అంత డబ్బు దొరికింది.. ఇంత‌ డబ్బు దొరికింది.. కార్యాలయాలపై దాడుల్లో ఏవేవో డాక్యుమెంట్లు దొరికాయి అంటూ కొన్ని ఛానళ్లు ఏమీ లేని దానిని హైలెట్ చేస్తున్నారని.. ఆ వార్తలన్నీ అవాస్తవాలు.. మా వద్ద ఎలాంటి అనఫిషియల్ డాక్యుమెంట్స్ కానీ.. డబ్బు కానీ అధికారులు గుర్తించలేదంటూ దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. కేవలం నా వద్ద రూ.5లక్షలు, శిరీష వ‌ద్ద రూ. 4.5 లక్షలు, నా కూతురు దగ్గర రూ.6.5 లక్షలు, ఆఫీసులో రూ.2 లక్షలు మొత్తంగా రూ.20 లక్షలు కంటే తక్కువ డబ్బు దొరికిందని.. అది కూడా అఫీషియల్ మనీ.. దానికి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. లిమిట్స్ ప్రకారమే బంగారం కూడా ఉందని.. ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కొనుగోలు చేయలేదంటూ దిల్ రాజు చెప్పాడు.

బిజినెస్ విషయంలో వారికి అన్ని వివరాలు.. ఎలా జరిగాయి అనేది వివరించాం. డిపార్ట్మెంట్ కూడా ఆశ్చర్యపోయింది. ఈ దాడులకు మేము పూర్తిగా సహకరించాం. అందరి అకౌంట్ విషయాలు క్లీన్ గా వివరించాం. అమ్మకు 19వ తేదీన జలుబు, దగ్గు ఎక్కువ అవడంతో హాస్పిటల్ కి తీసుకువెళ్లను. ఆమెకు గుండె పోట‌ని కొంతమంది వార్తలు రాశారు. ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది. ప్రస్తుత ఆమెకు 81 ఏళ్ళు.. రెండు రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల ద‌గ్గు ఎక్కువగా ఉండటంతో ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నారు. తెలిసి తెలియకుండా ఇలాంటి వార్తలు హైలైట్ చేయొద్దని మరోసారి కోరుతున్నా అంటూ.. దిల్ రాజు వివరించాడు. ఏమీ లేని దానికి ఎక్కువగా ఊహించుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. ఇక ఫేక్ కలెక్షన్ వల్ల ఐటీ సోదరులు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై ఇండస్ట్రీ మొత్తం కలిసి మాట్లాడతాం. ఈ విషయంపై నేను వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. అలాంటిదేమైనా ఉంటే ఇండస్ట్రీ తరఫున కరెక్ట్ చేయాలి. 90% టికెట్లు ఆన్లైన్ లోనే కొనుగోలు అవుతున్నాయి. బ్లాక్ మనీ సమస్య లేనేలేదు అంటూ దిల్ రాజు వివరించాడు.