మెగా అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మూవీ విశ్వంభర. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సింది. కానీ.. షూటింగ్ ఆలస్యం, ఇతరేతర కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ పై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్‌ని ఇప్పటివరకు ప్రకటించలేదు. విశ్వంభర సినిమాని సమ్మర్‌లో రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తున్నా.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయంపై మాత్రం క్లారిటీ రాకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమా రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్‌గా మారుతుంది.
విశ్వంభర సినిమాను మేకర్స్ మే 9న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మరో ముగ్గురు స్టార్ బ్యూటీస్ చిరు చెల్లెలుగా కనిపించనున్నారు. ఇక కనీసం సినిమా స్టోరీలైన్ ఏంటనే అంశంపై కూడా ఇప్పటివరకు మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఫాంటసీ డ్రామాగా సినిమా రూపొందుతుందని మాత్రమే సమాచారం. చిరు చాలా సంవత్సరాలు తర్వాత సోషల్ ఫాంటసీ కథతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
ఇక గతంలో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా మే 9, 1998న బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత అదే ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో రానున్న విశ్వంభర.. మే 9న రిలీజ్ చేయాలని.. ఆ లక్కీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మే నెలలో రిలీజ్ కు ప్లాన్ చేసిన మేకర్స్.. ఎలాగూ మే 9న లక్కీ డేట్ కాబట్టి.. అదే రోజున సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.