1000 రోజులు ఆడిన బాలయ్య వన్ అండ్ ఓన్లీ మూవీ ఏదో తెలుసా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస‌ సక్సెస్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సినిమాలతో వరసగా బ్లాక్ బ‌స్టర్లు అందుకున్న బాలయ్య.. మరో పక్క పాలిటిక్స్‌లోను రాణిస్తున్నారు. అంతేకాదు బుల్లితెరపై హోస్ట్‌గాను తన సత్తా చాటుతున్నాడు. ఈ జనరేషన్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న. బాలయ్య ఇప్పటికే తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను, రివార్డులను త‌న ఖాతాలో వేసుకున్న బాలయ్య సినిమాలు వంద రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి.

Balakrishna's film, Legend sets a new TFI record | Telugu Movie News -  Times of India

వంద కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇక బాలయ్య సినిమాలతో ఇప్పటికే ఎన్నో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. గతంలో ఓ సినిమా 100 రోజులు ఆడితే సక్సెస్, 200 – 250 రోజులు ఆడితే బ్లాక్ బస్టర్. ఇప్పుడు మాత్రం వారం రోజుల్లోనే కోట్ల కలెక్షన్లు కొల్లగొడితే అది పాన్ ఇండియన్ బ్లాక్ బ‌స్టర్ అని చెప్పేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమా 100 రోజులు ఆడితే నిజంగా అది పెద్ద రికార్డు అని చె.ప్పాలి అలాంటిది బాలయ్య నటించిన ఓ సినిమా వంద రోజులు కాదు ఏకంగా 1000 రోజులు నిరంతరాయంగా ఆడిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. బాలయ్య తన సినిమాలు తో క్రియేట్ చేసిన రికార్డుల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

బాలయ్య లెజెండ్ 1000(వెయ్యి) రోజుల పోస్ట‌ర్ విడుద‌ల‌,ఎక్కడ ఆడుతోందంటే |  Boyapati Sreenu Released Legend 1000 Days Poster - Telugu Filmibeat

ఇప్పటికే తన కెరీర్లో బాలయ్య 109 సినిమాల్లో నటించగా.. దాదాపు 70 సినిమాలు 100 రోజులకు పైగా థియేటర్లలో ఆడాయి. అయితే 1000 రోజులు ఆడిన సినిమా మాత్రం సంచలనం సృష్టించింది. ఎంతకీ బాలయ్య కెరీర్‌లో వెయ్యి రోజులు ఆడిన ఆ సినిమా మరేదో కాదు లెజెండ్. బాలయ్య లక్కీ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో ఈ మూవీ రూపొందింది. లెజెండ్ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్‌లో మెప్పించాడు. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించారు. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు ఈ సినిమాలో విలన్‌గా.. పవర్ఫుల్ పాత్రలో ఆకట్టుకున్నాడు. 14 రేల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలనచిత్ర బ్యానర్లపై రూపొందిన లెజెండ్ 2014 మార్చి 8న రిలీజ్ అయి భారీ సక్సెస్ నమోదు చేసుకోవడమే కాదు.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది.