ఈ పై ఫోటోలో కనిపిస్తున్న విలన్‌ను గుర్తుపట్టే ఉంటారు. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో ప్రతి నాయకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ నటుడు పేరు హరీష్ ఉత్తమన్. ఇక ఎన్నో సినిమాల్లో విలన్‌గా కనిపించిన హరీష్ బ్యాక్గ్రౌండ్ కానీ.. ఫ్యామిలీ గురించి గానీ చాలామందికి తెలిసి ఉండదు. అయితే ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య కూడా ఓ పాపులర్ బ్యూటీనే.
2010లో తమిళ్‌లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన హరీష్.. తర్వాత సౌత్ లోనూ ఎన్నో సినిమాల్లో నటిస్తూ అతి తక్కువ కాలంలోనే విలన్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో దాదాపు పదికి పైగా సినిమాలు నటించి ఆకట్టుకున్న హరీష్.. 2018 లో మేకప్ ఆర్టిస్ట్ అమృత కళ్యాణ్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాదిలోనే వీరుడు తీసుకున్నారు. కాగా 2024 జనవరిలో మలయాళ స్టార్ బ్యూటీ చిన్నుకురవిల ను రెండో వివాహం చేసుకున్నాడు.
నార్త్ 24 కతం, కసాబ్, లుక్కా చుప్పి తదితర సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఇటీవల ఈ జంట తన వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే హరీష్ ఉత్తమన్ ఇన్స్టా వేదికగా ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేసుకోగా.. ప్రస్తుతం ఆ పిక్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇక హరీష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమాలో ఒకేలాగ పాత్రలో కనిపించానన్నాడు. దీంతోపాటే.. పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు కూడా ఆయన చేతిలో ఉన్నాయి.