నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసేస్ గా ఆడియన్స్‌తో పిలిపించుకునే బాలయ్య.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు మరో పక్కన రాజకీయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా రాణిస్తున్నాడు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అద్భుతమైన సేవలందిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తి పతాకం ఎగరవేస్తున్న బాలయ్యకు మరో అరుదైన గౌరవం దక్కింది. నందమూరి బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. కథానాయకుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి.. అలాగే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో నిరుపేద కుటుంబాలకు ఉచిత చికిత్సతో అండగా నిలిచిన తీరుకు.. ఏపీలో హిందూపురం శాసనసభ్యుడిగా మంచి పనులు చేస్తున్నందుకు.. పద్మభూషణ్ పురస్కారంతో కేంద్రం బాలయ్యను సత్కరించనుంది.
బాలకృష్ణ బాల నటుడిగా వెండి తెరపై అడుగుపెట్టారు. తాతమ్మ కల సినిమాలో తండ్రి నటసార్వభౌమ తారక రామారావుతో కలిసి నటించిన ఆయన.. సోలో హీరోగా మారి స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇలా ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్‌తో ఈ జనరేషన్ హీరోలకు కూడా గడ్డి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. మరో పక్క ఏపీ హిందూపురం శాసనసభ్యుడుగాను మంచి పనులు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించనున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు సెలబ్రిటీస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలో నుంచి తెలుగువారు ఈ నిర్ణయానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం రాణిస్తున్న హీరోల్లో రూ.100 కోట్లకు పైగా సినిమాలు చేసిన అతి కొద్ది మంది హీరోలలో ఒకరిగా బాలయ్య నిలిచాడు. ఇక దివంగత మలయాళ రచయిత డైరెక్టర్ వాసుదేవ నాయర్‌ఖు పద్మవిభూషణ్ వరించింది. సింగర్ అర్జిత్ సింగ్‌ను పద్మశ్రీ తో సత్కరించనున్నారు. ఇక ఈ ఏడాది పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న ప్రముఖుల్లో తెలుగు సినిమాలో హీరోయిన్గా వ్యవహరించిన శోభన ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి పద్మభూషణ పురస్కారానికి శోభన సెలెక్ట్ అయింది. హిందీ ఇండస్ట్రీ నుంచి స్టార్ డైరెక్టర్ శేఖర్ కపూర్, కన్నడ ఇండస్ట్రీ నుంచి అనంతనాద్, తమిళ్ ఇండస్ట్రీ నుంచి అజిత్ పద్మభూషణ్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఇక 4 ఇండస్ట్రీ లతోపాటే హిందీ ఇండస్ట్రీలోను పద్మభూషణ్ ను పురస్కరించి సమానత్వాన్ని చాటుకుంది కేంద్ర ప్రభుత్వం.