గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమాకు.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. ఇక దిల్ రాజు తన కెరీర్‌లోనే ఎప్పుడు లేని రేంజ్‌లో హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందించాడు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతకు భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇక సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచే యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ఆడియన్స్‌లో ఆసక్తి తగ్గిపోయింది. సంక్రాంతికి వచ్చిన ఇతర సినిమాలకు గేమ్ ఛేంజర్ టాక్ ప్లస్ గా మారింది. ఈ క్రమంలోనే సినిమా ఫలితాలపై విపరీతమైన ఎఫెక్ట్ పడింది.
సినిమా కలెక్షన్స్ రోజురోజుకు తగ్గుతూ వచ్చాయి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాను బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూట్‌కు సిద్ధమైన చరణ్.. కీలకమైన రెండు స్కెడ్యూలను కూడా పూర్తి చేసుకున్నాడు. తదుపరి స్కేడ్యులను ఫిబ్రవరి నెలలో ప్లాన్ చేయనున్నారు మేకర్స్. కాగా గేమ్ ఛేంజర్ రిజల్ట్ కారణంగా ఆర్సి16 వీలైనంత త్వరగా పూర్తిచేసి.. ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తున్నారట. ఇక చరణ్‌ను రంగస్థలం చిట్టిబాబు తరహా రోల్ లో డైరెక్టర్ బుచ్చిబాబు క్రియేటివ్ గా చూపించనున్నాడని సమాచారం. ఈ సినిమాను పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో పిరియాడికల్ స్టోరీగా తెరకె క్కించనున్నాడట. బాలీవుడ్ బ్యూటీ జాన్వికాపూర్.. చరణ్ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక సినిమాను ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందించనున్నారట.
ఇక సినిమా పూర్తయ్యే సమయానికి బడ్జెట్ లెక్కలు ఏ రేంజ్ లో మారుతాయో చూడాలి. ఇలాంటి క్రమంలో గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో డైరెక్టర్ శంకర్‌దే తప్పంటు ఎన్నో కామెంట్లు వినిపించాయి. కాగా శంకర్ చేసిన తప్పులను రిపీట్ కాకుండా బుచ్చిబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. రామ్ చరణ్ కూడా దానిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చరణ్ కెరీర్‌లో మైల్డ్ స్టోన్‌గా మారిపోతుందంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బుచ్చిబాబు ఇదివరకే దర్శకత్వం వహించిన ఫస్ట్ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో.. రెండో సినిమాగా చరణ్ నటిస్తున్న సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే మాత్రం మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు అనడంలో అతిశయోక్తి లేదు.