టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల స్టేటస్ దక్కించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సినీ కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు భరించాల్సి ఉంటుంది. అలా.. ఇండస్ట్రీలో ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తమను తాను మలుచుకుని స్టార్ హీరో, హీరోయిన్గా ఎదుగుతున వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి కూడా ఒకటి. ఇక లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకొని టాలీవుడ్ మహానటిగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సావిత్రి, ట్రెడిషనల్ బ్యూటీ సౌందర్య తర్వాత అదే రేంజ్ లో ప్రేక్షకులను సాయి పల్లవి మెప్పిస్తుందంటూ ఇప్పటికే ఎంతోమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని ఈ ముగ్గురికి సంబంధించిన కొన్ని కామన్ క్వాలిటీస్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఒకప్పుడు సౌందర్య, సావిత్రి డి గ్లామరస్ పాత్రలలో నటిస్తు తమ అందం, అభినయంతో సాంప్రదాయ బద్ధమైన లుక్‌తో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మోడల్ యోగంలోను సాయి పల్లవి వాళలానే ట్రెడిషనల్ లుక్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ డి గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటు సినిమాలలో నటిస్ఉంది. తన అందం, అభినయంతో పాటు.. మాటతీరుతోను కుర్ర కారును ఆకట్టుకుంటుంది. ఇక వీళ్ళ ముగ్గురిలో ఉన్న మరో కామన్ పాయింట్ ముగ్గురి పేర్లు ఎస్ తో స్టార్ట్ అవ్వడమే.. అలా వెళ్ళ ముగ్గిరిలోను ఉన్న మరో బ్యాడ్ అండ్ గుడ్ క్వాలిటీ అంటే దానధర్మాలు చేయడమేనట. దివంగత మహానటి సావిత్రి ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే లక్షలు ఆస్తులు కూడబెట్టిన ఈ అమ్మడు చివరి రోజుల్లో ఎలాంటి దినస్థితిని ఎదుర్కొందో అందరికీ తెలిసిందే.
దానికి కారణం కూడా ఆమె మంచితనమే అంటూ ఎంతో మంది హేళన చేశారు. సావిత్రి అతి మంచితనం కారణంగానే.. హద్దులు దాటి మరి దానధర్మాలు చేసి చివరి రోజుల్లో అలాంటి పరిస్థితులు ఎదుర్కొందంటూ ఎన్నో కామెంట్లు వినిపించాయి. అయితే ఆమె తర్వాత హీరోయిన్ సౌందర్య కూడా సావిత్రిలానే దానధర్మాలను ఎక్కువగా చేస్తూ ఉండేదట. అంతేకాదు తనకు వచ్చిన రెమ్యూనరేషన్ లో సగభాగాన్ని ఇతరుల కోసం ఖర్చు పెట్టేదాట. కష్ట సమయాల్లో ఎంతోమందికి అండగా నిలబడేదని సమాచారం. ఇప్పుడు టాలీవుడ్ నాచురల్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి కూడా అదే విధంగా దానధర్మాలు చేస్తూ ఉంటుందని.. తన తోటి ఆర్టిస్టులకు ఎలాంటి కష్టం వచ్చినా తానే ముందుంటుందని సమాచారం. డబ్బు గురించి అసలు పెద్దగా పట్టించుకోదట. అలా ఈ ముగ్గురికి సంబంధించిన కొన్ని కామన్ క్వాలిటీస్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.