టాలీవుడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అటు రాజకీయాలోను.. ఇటు సినిమాలపరంగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస బ్లాక్ బస్టర్లతో తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బాలయ్య ..యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తూ తన ఎనర్జీటిక్ పర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. మరోపక్క బుల్లితెరపై హోస్ట్‌గాను తన సత్తా చాటుతున్నాడు. అలా ఇప్పటికే బాలయ్య తన సినీ కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.
సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు చాలామంది కొంతకాలానికి ఇండస్ట్రీకి విరామం ఇవ్వడం.. లేదంటే ఇంట్రెస్ట్ కి గుడ్ బై చెప్పేయడం చేస్తూ ఉంటారు. కానీ.. బాలయ్య మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక్క సంవత్సరం కూడా బ్రేక్ లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా 50 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకొని.. టాలీవుడట్‌లో తిరుగులేని నటుడుగా రికార్డు క్రియేట్ చేశాడు బాలయ్య. ఇలాంటి రికార్డు ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కాలేదు.
ఇక తాజాగ డాకు మహారాజ్‌తో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య.. అఖండ 2 తాండవం సినిమా పనుల్లో బిజీ అవుతున్నాడు. ఇక బాలయ్య కెరీర్‌లో 110వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అఖండ బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించడంతో.. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కనున్న అఖండ 2 తాండవంలో బాలయ్యను మరోసారి అఘోర పాత్రలో చూడాలని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.