23 ఏళ్ల ఈ బుల్లితెర బ్యూటీ ఆస్తుల ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్.. ఆమె ఎవ‌రంటే..?

సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకు మించి సంపాదించుకుంటున్నారు. రెమ్యూనరేషన్ పరంగాను దూసుకుపోతున్నారు. అంతేకాదు.. కేవలం సినిమాలకు హీరోయిన్ల కోసమే వస్తున్న ఆడియన్స్ ఎంతోమంది ఉంటున్నారు. ఇటీవల కాలంలో అలా చాలామంది హీరోయిన్లు ఓవర్ నైట్ లోనే స్టార్ బ్యూటీలుగా మారిపోయి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ దక్కించుకుంటూ హాట్‌ టాపిక్‌గా మారుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ స్టార్ బ్యూటీ కూడా అదే కోవలోకి వస్తుంది. అయితే ఆమె ఓ సినిమా హీరోయిన్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తను ఓ సీరియల్ హీరోయిన్.

Jannat Zubair Rahmani ✨✨ #jannatzubair #glampulse #actor #explorepage #trending #celebritynews #instagood

ఇక ఈ అమ్మడి పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్, ఆస్తి పాస్తుల ముందు స్టార్ హీరో, హీరోయిన్లు కూడా బలాదూర్ అనడంలో అతిశ‌యోక్తి లేదు. ఇంతకీ ఈమె ఎవరో చెప్పలేదు కదా.. తనే బాలీవుడ్ స్టార్ యాక్టర్ జన్నత్ జుబేరా. 23 ఏళ్ల వయసులోనే ఈమె దాదాపు రూ.250 కోట్లకు పైగా ఆస్తిని కూడబెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు కూడా ఈ రేంజ్‌లో సంపాదించలేదు అనడంలో అతిశ‌యోక్తిలేదు. అంతేకాదు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సీరియల్ బ్యూటీ కూడా ఈమె కావడం విశేషం. సోషల్ మీడియాలను మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ రిత్యా.. బాలీవుడ్ భాద్‌షా షారుక్ ఖాన్‌ను కూడా దాటేసింది.

20years Jannat Zubair Luking So Hot Like Grown Up Woman Flaunting Her Figure In Tight Dress At Party - YouTube

మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన జన్నత్.. తర్వాత సీరియల్‌లో అవకాశాలు దక్కించుకొని.. బాలీవుడ్ స్టార్ బ్యూటీగా మారిపోయింది. ఎన్నో సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అంతే కాదు.. రాణి ముఖర్జీ హీరోయిన్‌గా కనిపించిన హిచ్కి లోను జన్నత్ త‌న న‌ట‌న‌తో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం సీరియల్‌తో పాటు.. పలు టీవీ షోల‌లోను సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోస్ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటున్నాయి. ఆమె నుంచి ఓ ఫోటో వచ్చిందంటే చాలు.. గంటల వ్యావ‌ధిలో లైక్ లో వర్షం కురుస్తుంది. ఇంటర్నెట్ షేక్ అవుతుంది. ఇలా కేవలం బుల్లితెర సీరియల్స్ ద్వారానే ఈ రేంజ్ లో స్టార్‌డంను తెచ్చుకున్న‌ జన్నత్ రాబోయే రోజుల్లో బాలీవుడ్ లో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని లేదో హీరోయిన్గా మ‌రెని సక్సెస్‌లు అందుకుంటుందో వేచి చూడాలి.