సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే స్టార్ హీరోగా ఎదగడానికి ఎంతలా కష్టపడాలో.. ఆ స్టార్‌డంను కాపాడుకోవాలన్న అంతకు మించే శ్రమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మొదట స్టార్ హీరోలుగా రాణించిన మెల్లమెల్లగా అవకాశాలు తగ్గడంతో ఫెడరౌట్ అయిపోయిన నటులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరో కూడా ఒకడు.
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న ఈ హీరో.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. కానీ.. కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన క్రేజ్, స్టార్‌డంను ఈ హీరో కాపాడుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజె సంపాదించుకున్న హీరో ఊహించని రేంజ్‌లో సినిమాలకు దూరమయ్యాడు. ఫేడౌట్ హీరోగా మిగిలిపోయాడు. సినిమాలకు దూరవయ్యాడు. మళ్లీ.. ఇంత కాలానికి కానిస్టేబుల్ గా మారి నెటింట వైరల్‌గా మారుతున్నాడు.
అయితే ఈ హీరో నిజంగా కానిస్టేబుల్ కాలేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మూవీ కోసం కానిస్టేబుల్‌గా కనిపించనున్నాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో చెప్పలేదు కదా.. తనే హీరో వరుణ్ సందేశ్. ఇటీవల కానిస్టేబుల్ అన్నా.. కానిస్టేబుల్ అన్నా.. అంటూ సాగే ఓ సాంగ్‌లో పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చేతుల మీదగా రిలీజ్ చేపించారు. సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. శ్రీనివాస్ తేజ సాహిత్యం అందించగా.. సుభాష్ ఆనంద్ సంగీత దర్శకుడుగా వ్యవహరించాడు. నల్గొండ గద్దర్ నరసన్న పాడిన ఈ పాట ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.