అఖండ 2 నుంచి ప్రగ్యా ఔట్.. కారణం ఏంటంటే..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య‌ నుంచి నెక్స్ట్ రానున్న సినిమా అఖండ 2. మొదట ఈ సినిమా కోసం బాలయ్య లక్కీ బ్యూటీ ప్రజ్యాను అనుకున్నా.. ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో కొత్త హీరోయిన్‌ను రంగంలోకి దింపారు. అయితే నందమూరి అభిమానుల్లోనే కాదు.. కామన్ ఆడియన్స్‌లోను సడన్గా బాలయ్యకు ఇంతలా స‌క్స‌స్ తెచ్చి పెట్టిన ప్రఖ్యా జైశ్వాల్‌ ప్రాజెక్టు నుంచి ఎందుకు తప్పుకుంది.. అసలు ఏం జరిగింది అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇక‌ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమా షూట్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో శ‌ర‌వేగంగా జరుగుతుంది. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నాడు బోయపాటి.

Samyuktha Menon joins the cast of Akhanda 2-Telangana Today

ఇలాంటి క్రమంలో ప్రాజెక్టు నుంచి ప్రగ్య అవుట్ అవ్వడం.. సంయుక్త ఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా.. ఇటీవల బాలయ్యతో కలిసి ఒక గోల్డ్ యాడ్ లో సంయుక్త నటించింది. అలాగే ఆయనతో కలిసి షాపింగ్ మాల్ ఓపెనింగ్ లోను సందడి చేసింది. బహుశా ఈ క్ర‌మంలోనే అఖండ 2 హీరోయిన్ రేసులో సంయుక్త విన్ అయినట్లు తెలుస్తుంది. అయితే సంయుక్త రావడం వరకు ఓకే కానీ.. బాలయ్య‌తో ఇప్పటికే రెండు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్లు అందుకున్న ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం అందరికి షాక్ ను కలిగిస్తుంది. ప్రగ్యా ఎందుకు తప్పుకుంది.. లేదా ఎవరైనా తప్పించారా.. అని అనుమానాలు అంద‌రిలో వ్య‌క్తం అయ్యాయి.

అయితే తనకు తానుగా అఖండ 2 నుంచి ప్రగ్యా బయటకు వచ్చేసిందని సమాచారం. ఇక ఈ సినిమాలో 17 ఏళ్ల అమ్మాయికి తల్లిగా ప్రజ్యా నటించాల్సి ఉందట. ఇలా చేస్తే తన ఇమేజ్ దెబ‌వుతుంద‌నే భయంతోనే ఈమె ఆ పాత్ర నుంచి తప్పుకుందని సమాచారం. అఖండలో ఉన్న చిన్న పాప పెరిగి పెద్దదైన తర్వాత ఆమెకు సమస్య వస్తే.. అప్పుడు మాట ఇచ్చి వెళ్లిపోయిన అఖండ మళ్ళీ వెనక్కి వచ్చే ఆ సమస్యను ఎలా తీర్చడమే కథాంశంతో ఆఖండ 2 రానుంది. అంత పెద్ద అమ్మాయికి అమ్మగా చేస్తే కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ప్రగ్యా సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి 17 ఏళ్ల అమ్మాయి తల్లిగా సంయుక్త ఎలా సెట్ అవుతుందో చూడాలి.