టాలీవుడ్ హీరో, హీరోయిన్‌ల ఫ్రెండ్ రోల్స్, వ్యాంప్ పాత్రలలో నటించి.. సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది శ్రీ సుధా భీమిరెడ్డి. మంచి హైట్, పర్సనాలిటీ, హీరోయిన్‌లకు మించిన అందం, హాట్‌నెస్‌తో కాక రేపే ఈ ముద్దుగుమ్మ.. సినిమాల కంటే వివాదాల్లోనే ఎక్కువగా వైరల్ అవుతుంది. అలా తాజాగా శ్రీ సుధా చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ప్రొఫెషనల్ గా ఫిజియోథెరపిస్ట్ గా ఉన్న శ్రీ శుధలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. తను తీరిక సమయాల్లో అడవుల్లోకి వెళ్లి నేచర్ బ్యూటీతో పాటు, జంతువులను కెమెరాలో బంధిస్తూ ఉంటుందట. సినిమాలపై ఆసక్తి ఇండస్ట్రీలో అడుగుపెట్టేలా చేసిందని వివరించింది.
డాక్టర్ అయిన తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టి యాక్టర్ గా మారిన ఈ అమ్మడు.. బాడీగార్డ్, దమ్ము, ఎవరు, అవును, అర్జున్ రెడ్డి, సరిలేరు నీకెవరు, రూలర్, వలయం, వేర్ ద వెంకటలక్ష్మి ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక నిర్భయంగా బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది శ్రీ సుధా. ఎవరు ఏమనుకున్నా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆమె నైజం. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం విమానంలో జర్నీ చేస్తుండగా తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి చెంప పగలకొట్టి వాడి ఆట కట్టించింది. అంతేకాదు తనును ఆ వ్యక్తి ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడో చెబుతూ తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్‌గా మారింది. అయితే ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ చోటా కె.నాయుడు తమ్ముడు శ్యామ్ కే.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేశాడని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఆరోపణలే కాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్, అక్కడ నుంచి కోర్టుకు కూడా వెళ్లి రచ్చ చేసింది. ఇప్పటికి తనకు న్యాయం చేయాలంటూ పోరాటం చేస్తూనే ఉంది. పలువురు సినీ పెద్దలు, శ్యాంపై తాను పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె వెల్లడించింది. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఆమె.. శ్యామ్ తో రాజీ చేసుకోలేదని తేల్చి చెప్పింది. ఇండస్ట్రీలో తనకు మంచి పేరు ఉందని.. ఉదయాన్నే ఆరు గంటలకు షూటింగ్ కు వెళ్లాల్సి ఉండేది. అలాంటి టైంలో తెల్లవారుజామున రెండు, మూడు గంటల వరకు శ్యామ్ మా ఇంటికి వచ్చి గోల చేసేవాడు. రాత్రి అంత జరిగినా.. మళ్ళీ పొద్దున్నే ఏం జరుగునట్లు ప్రవర్తించేవాడు అంటూ చెప్పుకొచ్చింది. తను అతని మాటల్ని రికార్డ్ చేసేదన్ని.. ఇప్పుడు ఆ రికార్డులే నా కేసుకు బేస్‌గా నిలిచాయి అంటూ వివరించింది. శ్యామ్ టార్చర్ భరించలేక తన అన్నయ్య చోటా కె నాయుడు దగ్గరకు వెళితే.. నా తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అడిగాడని.. ఏం చెప్పాలో తెలియలేదు అంటూ శ్రీ సుధ వివరించింది. 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు 10 ఏళ్లుగా శ్యామ్ తో నాకు గొడవ జరుగుతుందని.. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.