మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడమే కాదు.. తన కుటుంబం నుంచి ఎంతోమంది యంగ్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసి.. మెగా సామ్రాజ్యాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వారిలో చిరు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఒకడు. చివరిగా విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమా షూట్లలో బిజీగా గడుపుతున్నాడు.
ఇలాంటి క్రమంలో ఈ యంగ్ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. సాయి ధరం తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని.. మ్యారేజ్ ఫిక్స్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. అమ్మాయి ఆ పెళ్ళి కూతురు ఎవరో సరిగ్గా తెలియదు కానీ.. టాలీవుడ్‌కు చెందిన అమ్మాయినే తేజ్ పెళ్లాడబోతున్నాడని టాక్ నడుస్తుంది. సాయి ధరమ్ తేజ్ ప్రేమించిన ఆ అమ్మాయి తన తల్లికి నచ్చకపోవడంతో ఇన్నాళ్లు కామ్‌గా ఉన్న సాయి తేజ్ ఇప్పుడు చిరంజీవి, రామ్‌చరణ్ జోక్యంతో ఆమెను ఒప్పించినట్లు తెలుస్తుంది.
సాయిధరమ్ తేజ అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం చిరంజీవి, రామ్‌చరణ్ తెలుసుకుని స్వయంగా రంగంలోకి దిగి సాయి తేజ తల్లి దుర్గతో మాట్లాడి ఒప్పించినట్లు సమాచారం. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ.. త్వరలోనే మెగా కుటుంబంలో మరో శుభ సంఘటన జరగబోతుందంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇంతకీ సాయి తేజ్ పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరో అనే అంశంపై ఆరా తీయడం మొదలు పెట్టేశారు నెటిజన్స్.