ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున నటులు ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అది కూడా.. మన టాలీవుడ్ స్టార్ హీరో అంటే.. ఆ హీరో ఎవరో తెలుసుకోవాలని అంత ఆరాటపడుతూ ఉంటారు. నిన్నమొన్నటి వరకు రూ.100 కోట్ల బెంచ్ మార్క్ మాత్రమే హైయెస్ట్ రెమ్యునరేషన్ గా ఉండేది. కానీ.. ఇప్పుడు సినిమాలో బడ్జెట్ వందల కోట్లు దాటిపోవడంతో.. హీరోల రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అలా తాజాగా ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం.. స్టార్ హీరో ఏకంగా ఒక్క సినిమా కోసమే రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడట.
అతను మరెవరో కాదు.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అని సమాచారం. పుష్ప 2 ది రూల్ సినిమా కోసం బన్నీ ఏకంగా రూ.300 కోట్ల రెమ్యూనరేషన్‌ను ఛార్జ్ చేశాడట. షారుక్ నటించిన జవాన్, సూర్య నటించిన కంగువ లాంటి సినిమాలకు కూడా కేవలం బడ్జెట్ రూ.200 నుంచి రూ.250 కోట్లు కాగా.. అల్లు అర్జున్ పుష్ప 2 రెమ్యూనరేషన్ రూ.300 కోట్లు ఉందని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. ఇక బన్నీ కంటే ముందు.. జైలర్ సినిమా కోసం రజనీకాంత్ రూ.250 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. లియో కోసం విజయ్ దళపతి రూ.250 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
ఇక షారుక్, సల్మాన్, అమీర్ ఖాన్ లాంటివారు కూడా రూ.150 నుంచి రూ.250 కోట్ల లోపే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అయితే ఇప్పటికే పుష్ప 2 కోసం కేవలం అల్లు అర్జున్.. రూ.300 రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ.. పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా దాదాపు రూ.2000 కోట్లు వసూళ్ళు చేస్తుందని అంచనాలలో ఉన్నారు ఫష్ట్ర్యాన్స్. ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిందని సమాచారం. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది.