నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్‌లో డాకు మహారాజ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పింది. అంతేకాదు సినిమాపై నందమూరి అభిమానులతో పాటు.. బాలయ్య బాబు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నారట.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాతో ఎలాగైనా మరోసారి హిట్ కొట్టి సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్న బాలయ్య.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో తెలియాలంటే మరికాస్త సమయం వేచి చూడాల్సిందే. అయితే ఈ సినిమాతో బాలయ్య, నందమూరి ఫ్యాన్స్ కు ఫుల్ మాస్ జాతర ఉండబోతుందని వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలను మించి మాస్ హిట్ ఈ సినిమా అందుకోనుందట. ఇక ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడని టాక్.
ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మెయిన్ విలన్ బాబీ డియోల్ కాదట. డ్యూయల్ రోల్ లో నటిస్తున్న బాలయ్యనే విలన్ గా కూడా కనిపించబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బాలయ్య తన సుల్తాన్ సినిమాలో.. విలన్ గాను నటించి మెప్పించాడు. సినిమా కమర్షియల్ గా సక్సెస్ అందుకోకపోయినా.. వీలనిజంలో ఆయనకు సాటి మరెవ్వరూ ఉండరనేంతలా బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్యే.. విలన్ అని తెలియడంతో అభిమానుల డాకు మహరాజ్ పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గాని ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియదు.