బాలయ్య, వెంకి మూవీస్ క్లాష్ పై యంగ్ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

సినీ ఇండస్ట్రీకి పొంగల్ ఎంత పెద్ద ఫెస్టివల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషలతో సంబంధం లేకుండా సౌత్‌ ఇండస్ట్రీ అందరూ సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటాయి. అలా రానున్న సంక్రాంతి బరిలో.. ఇప్పటికే మన టాలీవుడ్ టాప్ హీరోస్ చరణ్, బాలయ్య, వెంకటేష్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాల్లో సీనియర్ హీరోస్ నందమూరి నట‌సింహం బాలయ్య, అలాగే విక్టరీ వెంకటేష్ సినిమాలు క్లాష్‌ రానుంది. బాలయ్య నుంచి డాకు మహారాజ్, వెంకటేష్ నుంచి సంక్రాంతి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అవుతుండగా.. రెండు సినిమాలు ప్రస్తుతం రిలీజ్ కోసం స‌ర‌వేగంగా పనులను పూర్తి చేసుకుంటున్నాయి. కాగా ఈ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ బ్యానర్ల నుంచి వస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సినిమాకు యంగ్‌ ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, వెంకీ మామ.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈ క్రమంలోనే దిల్ రాజు, వెంకీ మామ ఇద్దరినీ ఉద్దేశిస్తూ నాగ వంశీ చేసిన పోస్ట్ నిటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. నాగవంశీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు తన బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని.. అలాగే లాస్ట్ టైం రెండు క్లాష్‌లు చూసాం. ఇప్పుడు మ‌న సినిమాలతో హ్యాట్రిక్‌ హీట్ లు కొడదాం అంటూ క్రేజీ పోస్టులు సూర్యదేవర నాగవంశి షేర్ చేసుకున్నాడు. దీనితో క్లాష్‌ విషయంలో నిర్మాతల నుంచి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఉండడంతో.. ఓ పాజిటివ్ స్పిరిట్ తో యంగ్ ప్రొడ్యూస‌ర్‌ నాగవంశి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాంటి రిలీజ్‌ సమయంలో మేకర్స్‌ పాజిటివ్ గా ఉంటే.. చాలా వరకు వివాదాలు సద్దుమనుగుతాయని.. రిలీజ్ సజావుగా జరుగుతాయి అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.