టాలీవుడ్ లో మహేష్ బాబు సెన్సేషనల్ రికార్డ్.. ఏ హీరో కైనా టచ్ చేయడం కష్టమేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న సూపర్ స్టార్.. నిన్న మొన్నటి వరకు కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమైన నటించారు. అటు బాలీవుడ్ సినిమాల్లోనూ, పాన్ ఇండియా అవకాశాలు వచ్చిన కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించాలని నియమానికి కట్టుబడి తెలుగు సినిమాల్లో నటిస్తూ సూపర్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఎలాంటి హీరో మైండ్ సెట్ అయినా మార్చేసి.. తనకు నచ్చినట్టుగా అనుగుణంగా మార్చుకొని సత్తా రాజమౌళికి ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే మహేష్ బాబును పాన్ ఇండియా కాదులే.. పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా చేద్దామని కన్విన్స్ చేసేసాడు జక్కన్న.

Mahesh Babu | మహేష్ కొత్త లుక్ ఇదేనా? | Mahesh Babu new look attracts all

ఇక జ‌క్క‌న‌తో ఓ సినిమా అంటే.. అది ఎంత కఠిన తరంగా ఉంటుందో, ఎన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయో గతంలో ఆయనతో పనిచేసిన హీరోలు ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే సినిమా పూర్తి అయ్యేసరికి మహేష్ బాబు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎంత లేదన్న కనీసం సినిమా రిలీజ్ కావడానికి మూడేళ్ల టైం పడుతుంది. ఇక ఇప్పటివరకు మహేష్ ఎన్ని సినిమాలు నటించిన.. ఆ సినిమాల్లో మహేష్ బాబు గెటప్ మాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలోనే రాజమౌళి.. మహేష్ బాబు గెటప్ పై పూర్తి ఫోకస్ పెట్టాడని.. ఎప్పటి వరకు మహేష్ ను చూడని ఓ సరికొత్త లుక్ తో చూపించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మహేష్ బాబు సంబంధించిన ఓ సెన్సేషనల్ రికార్డ్‌ నెట్టింట వైరల్ అవుతుంది.

Mahesh Babu Movies: Latest and Upcoming Films of Mahesh Babu| Times of India

టాలీవుడ్ టాప్ స్టార్‌గా అవతరించిన మహేష్.. మరే తెలుగు హీరో టచ్ చేయలేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన చివరిగా నటించిన ఐదు సినిమాలు భరత్ అనే నేను కు రూ. 101 కోట్లు షేర్, మహర్షి సినిమాకు రూ.105 కోట్లు, సరి లేరు నీకెవరు కి రూ.139 కోట్లు, సర్కార్ వారి పాట సినిమాకు రూ.111 కోట్లు, గుంటూరు కారం కు రూ.112 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టాడు. అలా ఐదు సినిమాలకు కలిపి మొత్తం రూ.568 కోట్ల వసూళ్లు సాధించి మహేష్ సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక వీటిలో చివరి మూడు సినిమాలు మహేష్ బాబు రేంజ్ సినిమాలు కాకున్నా.. స్టార్ డైరెక్టర్స్ అందరూ బిజీగా ఉన్న క్రమంలో.. కొత్త డైరెక్టర్స్ కు అవకాశాలు ఇచ్చి సినిమాల్లో నటించినా.. ఈ సినిమాలు కూడా కలెక్షన్ పరంగా సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఇప్పటివరకు నాన్ బాహుబలి కేటగిరీలో న‌టించిన ఏ హీరో కూడా ఈ రికార్డ్ ట‌చ్ చేయ‌లేక‌పోయారు.