ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా రిలీజ్ అయిన నయనాతారా బియండ్‌దా ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ ఆలస్యానికి కారణం ధనుష్ అంటూ లేడీ సూపర్ స్టార్ విమర్శలు కురిపించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ మూడు పేజీల లేఖను రాసింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలువురు హీరోయిన్లు ఆమెకు మద్దతు తెలుపుతూ ధనుష్‌కు సపోర్ట్‌గా నిలిచారు. ధనుష్ పై విమర్శలు చేసినందుకు నయనతార పై మండిపడ్డారు.
అయితే వివాదం తర్వాత సోషల్ మీడియా వేదికగా మొట్టమొదటిసారి ఓ పోస్ట్‌ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ధనిష్ చేసిన ఆ పోస్ట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఆయన డైరెక్షన్లో నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు స్టోరీ కూడా ధనుష్ అందించడం విశేషం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టులను రిలీజ్ చేస్తూ.. సినిమా సెకండ్ సింగిల్ కాధల్ ఫెయిల్.. సాంగ్ ఈనెల 25న రిలీజ్ చేయనున్నట్లు వివరించాడు ధనుష్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యాత్యూ థామస్, ప్రియా ప్రకాష్ వారియర్, అనికా సురేంద్రన్, రబియా ఖాతున్, పవిష్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
అయితే నయనతార బహిరంగ విమర్శలపై ధనుష్ ఎలా రియాక్ట్ అవుతారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ధనుష్ ఆ వివాదంపై కనీసం నోరు మెదపకపోవడం అందరికి షాక్ కలిగించింది. లేడి సూపర్‌స్టార్ విమర్శలను ధనుష్ ఏమాత్రం పట్టించుకోలేదని.. కేవలం తన పనిపై తన దృష్టి పెట్టాడని.. అభిమానులతో పాటు తండ్రి కస్తూరి రాజా వెల్లడించారు. అంతేకాదు ధనుష్ తెరకెక్కిస్తున్న సినిమాపై ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ఉన్నట్లు తమ కామెంట్ల రూపంలో తెలియజేశారు. వివాదాలను విస్మరించి కెరియర్ పై దృష్టి పెట్టడం ఎలాగో మీ నుంచి నేర్చుకోవచ్చు అంటూ.. మీరు మా అందరికీ ఇన్స్పిరేషన్ అంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
View this post on Instagram