విశ్వక్ ” మెకానిక్ రాకీ ” X రివ్యూ.. హిట్టా.. ఫట్టా..

టాలీవుడ్ మాస్‌కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్‌.. మాస్ యాక్షన్, కామెడీ.. మెకానిక్ రాకీ తాజాగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. రవితేజ ముళ్ళపూడి డైరెక్షన్‌లో.. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాను రామ్ తాళ్లూరి.. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇక ఈ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన‌ ఇక విశ్వక్.. మెకానిక్ రాఖీగా ఆడియన్స్ను మెప్పించాడా.. లేదా.. సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ట్విట్టర్ టాక్ ఏంటో చూద్దాం.

విశ్వక్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ మాస్ హీరో.. ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న విశ్వక్.. మెకానిక్ రాకీతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతారని అంతా భావించారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్‌ను అందుకుంటుంది. 2:35 నిమిషాల రన్ టైం తో రూపొందిన ఈ సినిమాకు.. ఫస్ట్ ఆఫ్ బోరింగ్ అనిపిస్తోందని.. నిరాశ పర్చినట్లు రివ్యూలు వస్తున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తాయని చెబుతున్నారు.

ఇక విశ్వక్ యాక్టింగ్ సినిమాకి హైలెట్ గా నిలిచిందట. జేక్స్‌ బిజీయో సంగీతం.. ఓకే అనిపించినా సాంగ్స్ పెద్ద మైన‌స్ అంటూ రివ్యూలో తెలిపారు. ఇక మరికొందరు సినిమా యావరేజ్ గా ఉందని.. ఫస్ట్ అఫ్ ఫుల్ బోరింగ్ గా ఉంటుందని.. చాలా ఓపిగ్గా చూడాలంటూ చెప్పేశారు. సెకండ్ హాఫ్ కూడా గొప్పగా ఏం లేదని తమ రివ్యూ లో వెళ్లడించారు. మరికొందరు టిపికల్ విశ్వక్ మూవీ అంటూ సింగిల్ వ‌ర్డ్‌తో డైరెక్ట్ రివ్యూ ఇచ్చేసారు. కామెడీ థ్రిలర్గా వ‌చ్చిన‌ ఈ సినిమా కామెడీ సీన్స్ అస్సలు ఆకట్టుకోలేకపోయారట‌.

అసలు ఆ సన్నివేశాలు అనవసరం అనిపించాయని.. కథని సాగదీసినట్లు బోర్ ఫీలింగ్ వచ్చిందని.. ట్విటర్ వేదికగా తమ రివ్యూలో తెలియజేస్తున్నారు. అసలు కథ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సెకండ్ హాఫ్‌లో చూపించారట. ఇలా ఎక్స్ రివ్యూల ప్రకారం ఫస్ట్ అఫ్ సుద్ద బోరింగ్ గా ఉందని.. సెకండ్ హాఫ్ చూడవచ్చు.. విశ్వక్ యాక్టింగ్ మెప్పిస్తుందంటూ ఆడియ‌న్స్ త‌మ అఅభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. ఒరిజినల్ రివ్యూ ఏంటో తెలియాలంటే మరి కొద్ది సేపటి వరకు వేచి చూడాల్సిందే.