సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకోకపోయినా.. చాలామంది ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. వారి ఫేవరెట్ మూవీలో లిస్టులో చేరిపోతాయి. అలాంటి సినిమాలలో వాన సినిమా కూడా ఒకటి. కమర్షియల్‌గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోకపోయినా.. మంచి టాక్ తెచ్చుకుంది. పోను.. పోను.. సినిమా కాల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పాటలు, యాక్టింగ్ ఇలా ప్రతిదానికి ఆడియన్స్ ఫీదా అయిపోయారు.
ఇప్పటికి వాన సినిమా టీవీలో వస్తుందంటే ఆడియన్స్ కళ్ళప్పచెప్పిమరి సినిమాను చూస్తూ ఉంటారు. అలాంటి రిపీట్ వాల్యూ తెచ్చుకున్న సినిమా ఇది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ చాలామంది వింటూనే ఉంటారు. ఈ సినిమాకు వర్షం ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. రాజు దర్శకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక వినయ్ రామ్ హీరోగా ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అయితే తర్వాత 15 ఏళ్ల వరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించని వినయ్ రాయ్.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాంఢీవదారి అర్జున్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది అతి తక్కువ బడ్జెట్‌తో రిలీజైజ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి సంచలనం సృష్టించిన హనుమాన్ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించాడు.
ఇక వినయ్ రాయ్ భార్య కూడా తెలుగులో స్టార్ బ్యూటీ అని చాలామందికి తెలియదు. ఆమె మరెవరో కాదు విమల రామన్. 2009లో వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన.. ఎవరైనా ఎప్పుడైనా సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత గాయం 2, రంగాది దొంగ, రాజ్, చట్టం లాంటి బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తర్వాత రెండేళ్ళ గ్యాప్ ఇచ్చి తరుణ్ హీరోగా వచ్చిన చుక్కలాంటి అబ్బాయి.. చక్కనైన అమ్మాయి.. సినిమాలో హీరోయిన్గా కనిపించింది. అయితే అమ్మడు ఈ సినిమాతోనూ బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయింది. ఇక చివరకు అంతిమ తీర్పు సినిమాతో హీరోయిన్గా కనిపించిన విమల.. ఇండస్ట్రీకి దూరమైంది.