” అఖండ తాండవం “కి హీరోయిన్ కి లింక్ ఏంటో చెప్పిన బోయపాటీ.. మామూలోడు కాదుగా..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఒకరిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బోయపాటికి.. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాక్షన్ సినిమాలకు క్యారాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన బోయపాటి.. హీరోను ఎలివేట్ చేయడంలో ఆయనను మించిన దిట్ట మరొకరు లేరు అనే రేంజ్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక బోయపాటి, బాలయ్య కాంబోలో సినిమాలంటే ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బోయపాటి బాలయ్యతో మూడు సినిమాలను తరికెక్కించి ఆ సినిమాల‌నింటితోను మంచి స‌క్స‌స్ అందుకున్నాడు. వరుస ప్లాపులతో ఉన్న బాలయ్యను బోయపాటి మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టారు.

Akhanda 2: फिर शिव का भक्त करेगा तांडव, 'अखंडा-2' की हुई अनाउंसमेंट, ये होगी स्टारकास्ट | Akhanda 2 Balakrishna Next Movie with Boyapati Srinu teaser out and shooting start | Patrika News

అలాంటి బోయపాటి – బాలయ్య కాంబో నాలుగో సారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా బోయపాటి అఖండ 2 తాండవం రూపొందించడానికి సిద్ధమవుతున్నా.డు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్‌ పైకి రానుంది. ఇటీవ‌ల ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా గ్రాండ్ లెవెల్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బోయపాటి అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకి నందన వాసుదేవ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశాడు. ఈ ఈవెంట్లో బోయపాటి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అయితే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా ప్రతి ఒక్కరి గురించి చెప్పిన బోయపాటి.. హీరోయిన్ గురించి చెప్పడం మర్చిపోయాడు.

Devaki Nandana Vasudeva Pre Release Event Photos - Gallery

మళ్లీ తనే వెనక్కు వచ్చి హీరోయిన్ గురించి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్ పేరుకు తనకు ఓ మంచి లింక్‌ ఉందంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న అఖండ తాండవం సినిమా గురించి వెల్లడిస్తూ.. బల‌య్య‌ నటిస్తున్న ఈ సినిమా శివుడు సినిమా అని.. శివుడు ఉండేది వారణాసిలో.. ఈ హీరోయిన్ పేరు కూడా వారణాసి అంటూ చెప్పుకొచ్చాడు. ఆ రకంగా నాకు.. ఈ హీరోయిన్ తో మంచి లింక్‌ ఉందని వెల్లడించాడు. ఇక సినిమాలో హీరోయిన్ విజువల్స్ చూశానని.. చాలా బాగా నటించింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని హీరోయిన్ కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లాలంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బోయపాటి హీరోయిన్ వారణాసి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. వామ్మో బోయపాటి మామూలోడు కాదుగా.. హీరోయిన్ గురించి మర్చిపోయి మళ్ళీ.. ఆమె ఫీల్ కాకూడదని తన సినిమాతో పోలిస్తూ పొగడ్తలతో కవర్ చేసేసాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.