సత్యదేవ్ ” జీబ్రా ” రివ్యూ: బ్లాక్ & వైట్ మ‌నీ వార్‌లో గెలిచింది ఎవ‌రు..?

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్ సత్యదేవ్ తాజాగా జీబ్రా మూవీ తో ఆడియన్స్ పలకరించిన సంగతి తెలిసిందే. మెగా బ్లెస్సింగ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ అయిందా.. లేదా.. సత్యదేవ్ ఆడియన్స్ మెప్పించాడా.. జిబ్రా ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ లో చూద్దాం. సత్యదేవ్, కన్నడ స్టార్ట్ ఆలీ ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన హైలీ ఆంటీసిపెటెడ్ మల్టీస్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమాని.. పద్మజా ఫిలిం ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజా, బాలసుందర్, దినేష్ సుందరం నిర్మించారు.

ప్రియా భవాని శంకర్, జెనీఫర్ ఫిషినాటో హీరోయిన్స్ గా కనిపించిన సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక‌ జిబ్రా.. బ్లాక్ అండ్ వైట్ కి మెటాఫ‌ర్ అన్న సంగతి తెలిసిందే. కాగా బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ తిరిగే కథ‌గా జిబ్రా మూవీ తెర‌కెక్కింది. అయితే సినిమా చివరి వరకు ఎవరు మంచి.. ఎవరు చెడు.. అనేది తెలియకుండా ఎంగేజ్ చేస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఇక ప్రతి ఒక్కరిలో గ్రే షేడ్ ఉంది. దీనికి సింబాలిక్ గానే టైటిల్ ఫాంట్.. గ్రే పెట్టి సినిమాను జీబ్రా టైటిల్ ఫిక్స్ చేశారట‌ మేక‌ర్స్‌. తెలుగు సినీ ఆడియన్స్ మెచ్చే కంటెంట్ జీబ్రాతో ఆడియన్స్‌కు ద‌క్క‌నుంద‌ని తెలుస్తుంది.

ఎంతో టాలెంటెడ్ ఉన్న‌ సత్యదేవ్‌కి ఇప్పటివరకు సరైన సక్సెస్ రాలేదు. కానీ జీబ్రాతో స‌త్య దేవ్ అలాంటి సక్సెస్‌ని అందుకోనున్నాడట. ఓవరాల్ ట్విట్టర్ వేదికగా సినిమాకు మంచి రివ్యూ వస్తున్నాయి. మంచి కంటెంట్‌తో డైరెక్టర్.. ఎంగేజింగ్ కథను చూపించడంలో సక్సెస్ అయ్యాడని సమాచారం. ఇక యాక్టింగ్‌లో సత్యదేవ్‌తో పాటు.. ధనుంజయ్ కూడా అదరగొట్టాడట. కథను ఈశ్వర్ కార్తీక్ చాలా బ్రిలియంట్ గా రాశాడు. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ ఇలా అన్నీ ఆకట్టుకుంటున్నాయంటూ.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ధనుంజయ క్యారెక్టరైజేష‌న్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. మరి కొందరు సినిమా ఫస్ట్ ఆఫ్ ఓకే గా ఉన్న.. సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది అంటూ రివ్యూలలో తెలియజేస్తున్నారు. ఇక ఈ బ్లాక్ అండ్ వైట్ మనీ వార్‌లో చివ‌ర‌కు గెలిచిందెవరో తెలియాలంటే ఒరిజినల్ రివ్యూ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.