టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. అభిమానులు బాలయ్యను ముద్దుగా ఎన్బికే అని పిలుస్తూ ఉంటారు. ఇక సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య త్వరలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్న బాలయ్య డాకు మహారాజ్ పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి బ్లాక్ పాస్టర్ కాయమంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మరోపక్క రాజకీయాల్లోనూ బాలయ్య దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
సీనియర్ ఎన్టీఆర్ దంపతుల ఆరో ఆరో తనయుడిగా బాలయ్య 14 సంవత్సరాల వయసులోనే తాతమ్మ కల సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే బాలయ్య క్వాలిఫికేషన్ చాలా మందికి తెలిసి ఉండదు. కేవలం సినిమాల్లో, రాజకీయాల్లోనే కాదు.. క్వాలిఫికేషన్‌లోనూ బాలయ్యకు ఓ రేంజ్ ఉంది. ఇక బాలయ్య.. తన డిగ్రీ నైజం కాలేజీలో పూర్తి చేశారు. ఇంటర్ తర్వాత నటుడు కావాలని ఫిక్స్ అయినా బాలయ్య.. కనీసం డిగ్రీ అయినా ఉండాలని ఎన్టీఆర్ కోరిక మేరకు బీఏ చదువున కంప్లీట్ చేశాడు. కెరీర్ మొదట్లో తండ్రితో కలిసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన బాలయ్య.. సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్లో శ్రీమద్విరాటపర్వం, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాల్లో నటించే మెప్పించాడు.
ఇక బాలయ్య హీరోగా నటించిన ఫస్ట్ మూవీ సాహసమే జీవితం. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత వీరిద్దరు కాంబోలో ఏకంగా 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇక కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలయ్య 7 సినిమాల్లో, రాఘవేంద్ర డైరెక్షన్లో 6 సినిమాల్లో నటించి మెప్పించారు. తన సొంత పేరుతో 7 సినిమాల్లో నటించిన బాలయ్య.. కేవలం ఒకే ఒక్క జానపద సినిమాల నటించాడు. అదే భైరవద్వీపం. యమగోల రీమేక్ చేయాలని భావించిన అది వర్కౌట్ కాలేదట. ఇక మొదటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ప్రస్తుతం స్టార్ హీరోగా రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే స్టేజ్ కు ఎదిగారు. ఆయన కావాలంటే ఇంకా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా దర్శక, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.