ప్రముఖ పొలిటిషన్ వైయస్ రాజశేఖర్ వారసురాలిగా రాజకీయాల్లోకి.. మాజీ సిఎం జరన్ మోహన్ రెడ్డి పోదరిగా పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన వైఎస్ షర్మిలకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న షర్మిల.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య ఎఫైర్ వార్తలు గతంలో వైరల్ అయ్యిన సంగి తెలిసిందే. తాజాగా ఆ వార్తలు పై షర్మిల రియాక్ట్ అవుతూ ప్రభాస్ ఎవరు తనకు ఇప్పటికీ తెలియదని స్పష్టం చేసింది. ఏపీ మాజీ సీఎం జగన్‌కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని నుంచి రూ.1,750 కోట్ల లంచం అందినట్లు అమెరికా ఏజెన్సీ దర్యాప్తుల్లో వెల్లడైంది.
ఈ క్రమంలోనే శుక్రవారం విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసిన షర్మిల.. జగన్ తన స్వప్రయోజనాల కోసం చెల్లి, తల్లి, తండ్రి ఇలా అందరి పేర్లను వాడుకుంటాడని ఫైర్ అయింది. బాలకృష్ణ గారి నివాసంలో ఉన్న ఔపీ అడ్రస్ నుంచి నాపై తప్పుడు ప్రచారం జరిగిందని జగన్‌మోహన్ రెడ్డి కేసు పెట్టినట్లు ఇటీవల ఎంటర్టైనింగ్ వివరించారు. మీకు నిజంగానే చెల్లెలిపై ప్రేమ ఉందా.. బాలకృష్ణ గారి నివాసంలో సిస్టమ్ ఐపి అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే.. ఐదేళ్లు సీఎంగా ఉండి మీరేం చేశారు.. బాలకృష్ణ పై ఎందుకు విచారణ చేపట్టలేదు.. ఇప్పుడైతే చెల్లెలపై ప్రేమ ఉన్నట్లు మీరు మాట్లాడుతున్నారు అంటూ షర్మిల జగన్ పై ఫైర్ అయ్యింది.
ప్రభాస్‌కు నాకు సంబంధం లేదని.. నాపై జరిగిన అసత్య ప్రచారంపై నేను కేసు పెట్టిన వెంటనే ఎందుకు రియాక్ట్ అవలేదు అంటూ ప్రశ్నించింది. నేను ప్రభాస్ అనే వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు.. నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్న. ప్రభాస్ ఎవరు నాకు ఇప్పటికీ తెలియదు. అతనితో.. నాకు ఎలాంటి సంబంధం లేదు. జగన్కు ఇవన్నీ తెలిసి కూడా నా క్యారెక్టర్ లేనట్లు చూపించేలా ప్రచారం చేయించాడు. ప్రభాస్‌తో సంబంధం ఉన్నట్లు గత ఐదేళ్లుగా జగన్.. తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నాడు. అది నిజం కాదా.. మీకు చెల్లెలిపై కాస్తయినా ప్రేమ ఉందా.. అసలు మీకు సిగ్గు ఉందా.. అంటూ ఫైర్ అయింది. మళ్ళీ నా వీడియోస్ ని ప్లే చేసి మీకు మైలేజ్ కోసం వాడుకుంటున్నారు. మీకు పేరు వస్తుందంటే తల్లి, చెల్లి ఎవరినైనా వాడేస్తారు. నాన్న పేరు సిబిఐ చారజ్ షీట్‌లో కూడా పెట్టేస్తారు. మీకు మీరే సాటి అంటూ జగన్మోహన్ రెడ్డి పై మండిపడింది. ప్రస్తుతం షర్మిల చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.