టాలీవుడ్ రెబల్ స్టార్.. ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరి ప్రభాస్ సినిమా అంటే వరల్డ్ వార్ లెక్క అంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ప్రస్తుతం ప్రభాస్ హారర్ థ్రిలర్ మూవీ రాజాసాబ్‌లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఫౌజి సినిమాలో నటించనున్నాడు. ఆర్మీ ఆఫీసర్గా కథలో కనిపించనున్నట్లు సమాచారం.
ఇది పూర్తయిన వెంటనే సలార్ 2 కు సిద్ధమవుతున్నాడు. దీని తర్వాత కల్కి 2, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ పూర్తి అవ్వడానికి 2028 వరకు సమయం పడుతుంది. ఇక 2029 లో ప్రభాస్ ఏ సినిమాలో నటిస్తాడని దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే హూంబలే ఫిలిమ్స్ 2028 వరకు ప్రభాస్ సినిమాలు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేసింది. ఈ క్రమంలోనే అప్పటివరకు బిజీగా ఉండే ప్రభాస్ 2029లో సితార బ్యానర్స్ పై ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా సూర్యదేవర నాగోవంశీ ఓ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు.
ప్రభాస్ పేరు చెప్పకపోయినా 2029కి ఓ స్టార్ హీరోతో పొలిటికల్ మూవీ తీస్తున్నామంటూ వెల్లడించాడు. అంటే.. అది కచ్చితంగా ప్రభాస్‌తోనే అయి ఉంటుందని సందేహాలు జనాల్లో మొదలయ్యాయి. 2028 వరకు ఆగి.. 2029లో స్టార్ హీరో సినిమా అంటే.. కచ్చితంగా అది ప్రభాసే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ప్రభాస్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలోని నటించనే లేదు. రాజకీయంతో సంబంధం లేకుండా తన సినిమాలు తాను నటిస్తూ బిజీగా ఉంటున్న ప్రభాస్.. కెరీర్ పిక్స్‌లో ఉన్న ఇలాంటి టైంలో పొలిటికల్ ప్రాజెక్ట్ లో నటిస్తాడా అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అయితే ప్రభాస్ ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటిస్తున్నాడా.. లేదా.. అనే దానిపై క్లారిటీ రావాలంటే జనవరి వరకు వేచి చూడాల్సిందే.