సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీల్ గా కొనసాగుతున్న చాలామంది డిగ్రీ ని కూడా కంప్లీట్ చేయని నటీనటులు ఉన్నారు. ఇలాంటి క్రమంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ చదువుకున్న స్టార్ సెలబ్రిటీలలో నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఓ వ్యక్తి ఉన్నాడంటూ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. అంతే కాదు.. నందమూరి ఫ్యామిలీలోనే ఇదో హిస్టరీఅట. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు.. దివంగత నటుడు హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాణ్ రామ్. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కళ్యాణ్ రామ్.. టాప్ యాక్టర్, స్టార్ పొలిటిషన్ ఎన్టీ రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. హరే రామ, అతనొక్కడే, 118 ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
తన తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. అంతేకాదు కళ్యాణ్ రామ్.. అద్వితి క్రియేటివ్ స్టూడియోని కూడా నెలకొల్పాడు. ఇది వీడియో ఎఫెక్ట్స్ క్రియేట్ చేసే బిగ్గెస్ట్ స్టూడియో. ఇక స్టూడియోలోనే లెజెండ్, నాన్నకు ప్రేమతో , కృష్ణాష్టమి లాంటి ఎన్నో సినిమాల విజువల్ ఎఫెక్ట్స్ రూపొందించారు. ఇక కళ్యాణ్ రామ్ హైదరాబాద్లో.. హరికృష్ణ, అతని మొదటి భార్య లక్ష్మీ కుమారి దంపతులకు జన్మించాడు. అంతేకాదు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ స్టెప్ బ్రదర్ అవుతాడన సంగతి అందరికీ తెలిసిందే.
కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎడ్యుకేటెడ్ యాక్టర్ లో కళ్యాణ్ రామ్ మొదటి వాడట. కళ్యాణ్ రామ్ హైదరాబాద్ సెయింట్ పాల్స్ హైస్కూల్లో, విజయవాడ కెసిపి సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ స్కూల్లో తన చదువును పూర్తి చేశాడు. కోయంబత్తూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి వెంటనే సినిమాల్లో హీరోగా నటించాలని చూశాడట. అయితే హరికృష్ణ మాత్రం తన చదువును పూర్తి చేసిన తర్వాతే ఇండస్ట్రీలోకి రావాలని పట్టుబట్టాడట. దీంతో తండ్రి కోరికను తీర్చడానికి తన సినిమా కోరికను కొద్దిగా హోల్డ్ లో పెట్టి చికాగోలోని ఇల్లునియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ కోర్సును పూర్తి చేశాడు. అలా ఇప్పటివరకు నందమూరి కుటుంబంలోనే మాస్టర్స్ పూర్తి చేసిన మొట్టమొదటి గ్రాడ్యుయేట్ గా చరిత్ర సృష్టించాడు. తర్వాత కళ్యాణ్ రావు 2006 ఆగస్టు 9 స్వాతిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.