17 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ ప్రభాస్ రొమాన్స్.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే..

టాలీవుడ్ రాబస్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ లైన‌ప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వరుస సినిమాలను కమిట్ అవుతూ గ్యాప్ లేకుండా 2028 వరకు డేట్స్ ఇచ్చేసి బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ స్పీడ్ చూసి మిగ‌తా హీరోలంతా షాక్ అవుతున్నారు. దాదాపు 6 ఏళ్ల పాటు ప్రభాస్ రెంజ్‌కు తగ్గ హిట్ ఒక్కటి లేకపోయినా.. ఆయన క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. కాగా ఈ ఏడాది చివర్‌లో సెలార్‌తో సాలిడ్ హీట్ అందుకున్న ప్రభాస్.. మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఇక ఈ ఏడాది నాగ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన కల్కితో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఈ సినిమాతో ఆల్ టైం బ్లాక్ పాస్టర్ రికార్డును సొంతం చేసుకున్నాడు.

Is Prabhas and Nayanthara reuniting after 16 Years for 'Kannappa'? Deets  inside | Telugu Movie News - Times of India

ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకొని సంచలనం సృష్టించాడు. ఇక సలార్, కల్కి సెకండ్ పార్ట్ కూడా లైన్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని సినిమాలను సైన్ చేస్తూ బిజీగా గ‌డుపుతున్న ప్రభాస్.. వాటిలో మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నాడు. టైటిల్‌తోనే ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి హైప్‌ మొదలైంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింతగా పెంచేసాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలో డిఫరెంట్ రోల్స్‌లో నటిస్తున్నాడని ఆడియన్స్‌కు క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ మూవీ హారర్ థ్రిల‌ర్ అన్న సంగతి తెలిసిందే.

The RajaSaab Glimpse | Prabhas | Maruthi | Thaman S | People Media Factory

రాజాసాబ్ లో ప్రభాస్ స‌ర‌స‌న ఐదుగురు హీరోయిన్స్ కనిపించనున్నారట. ఇదిలా ఉంటే తాజాగా రాజాసాబ్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని.. అందులో స్టార్ హీరోయిన్ ఐటమ్ గర్ల్ గా మెర‌వ‌నుందని టాక్. ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార అట. గతంలో ప్రభాస్, నయనతారతో యోగి సినిమాలో కలిసి నటించిన‌ సంగతి తెలిసిందే. దాదాపు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ప్రభాస్ న‌యన్‌ ఒకే స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియదు కానీ.. ఈ సినిమాను వచ్చేది అది ఏప్రిల్ 14 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు.