గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శోభిత – నాగచైతన్య పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మరికొద్ది రోజుల్లోనే ఈ జంట పెళ్లి పీటలు ఇకనున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి ముందే భార్యాభర్తల్లా రేంజ్‌లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న శోభిత – చైతు.. ముఖ్యంగా ఏఎన్నార్ ఈవెంట్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. పెళ్లికి ముందే ఆక్కినేని ఇంటికి కోడలి హోదాను శోభితకు కట్టబెట్టేసాడు నాగార్జున. తాజాగా జరిగిన ఐఫా అవార్డ్స్ లో చాలా స్పెషల్గా శోభిత మెరిసింది.
అక్కినేని ఫ్యామిలీ అంతా ఈవెంట్లో సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్లో అందరికన్నా ట్రెడిషనల్ అండ్ స్టైలిష్ లుక్ లో ఎట్రాక్టివ్ గా హైలెట్గా నిలిచింది శోభిత. అందరి అటెన్షన్ను అమ్మడు గ్రాబ్ చేసింది. తాజాగా నాగార్జున ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత – చైతు మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వీళ్ళ పెళ్లి జరగబోతుందని.. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. మేము ఎప్పుడూ స్టూడియోగా అన్నపూర్ణను భావించలేదు. అది మా ఇల్లు లాగే అనుకున్నాం. నాన్నగారి ఆశీస్సులు ఎప్పుడూ అక్కడ ఉంటాయి.
అక్కడ పెళ్లి చేసుకుంటే చైతు – శోభితల లైఫ్ బాగుంటుందని నా నమ్మకం. నాన్న ఆశీస్సులు ఉంటాయని నేను నిర్ణయం తీసుకున్నానంటూ చెప్పుకోవచ్చాడు. చైతుతో పెళ్లికి శోభిత ఫ్యామిలీ మమ్మల్ని కోరింది ఒకటే. చాలా ట్రెడిషనల్ గా పెళ్లి చేయాలని అడిగారు. మిగతా విషయాలన్నీ మీ ఇష్టం అంటూ వదిలేశారు. నాకు కూడా ఆ మంత్రాలు వింటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే కరెక్ట్ కూడా అనిపించింది. అందుకే తెలుగు సాంప్రదాయం ప్రకారం చైతు – శోభిత పెళ్లి జరుపుతున్నాం అంటూ నాగార్జున కామెంట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.