టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా గత కొద్దిరోజులుగా తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తో కీర్తి ప్రేమలో ఉందని త్వరలో అతనిని వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. వాటిని కీర్తి ఖండించిన సంగతి తెలిసిందే. తము కేవలం స్నేహితులం అంటూ కీర్తి సురేష్ వెల్లడించింది. తర్వాత మరొకరితో ప్రేమలో ఉందంటూ తమిళ్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత దళపతి విజయ్‌తో ప్రేమలో పడిందంటూ టాక్ నడిచింది. ఇలా కీర్తి సురేష్ పెళ్లి విషయంలో ఎన్నో రూమర్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. వాటన్నింటికి తాజాగా ఆమె తండ్రి చెక్ పెట్టారు. కీర్తి సురేష్‌కు పెళ్లి ఫిక్స్ అయిందని.. 15 సంవత్సరాల నుంచి కీర్తికి పరిచయం ఉన్న తన మంచి స్నేహితుడైన ఆంటోనీ తటిల్‌తో ఆమె వివాహం జరగబోతుందంటూ అఫీషియల్ గా వెల్లడించాడు. గోవాలో ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగనుందని అయినా అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
మొత్తానికి అమ్మడి పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్లన్నిటికీ చెక్ పెట్టేసి.. పెళ్లి కొడుకు ఎవరు.. పెళ్లి ఎక్కడో కూడా కీర్తి సురేష్ తండ్రి అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చాడు. ఇకనైనా కీర్తి సురేష్ పై వచ్చే చెత్త రూమర్లను ఆపేయాలంటూ.. డిసెంబర్ 11 లేదా 12న ఈ జంట వివాహం గోవాలో జరగబోతుంది అంటూ ఫాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేష్ ఆంటీని తటిల్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.