టాలీవుడ్ కింగ్.. అక్కినేని నాగార్జున భార్యగా.. అమలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో సైత్ స్టార్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అమల.. ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ నుంచి సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. తను నటించినవి చాలా తక్కువ సినిమాలైనా.. ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది. రెండు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్న అమల.. తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించింది. అయితే వాటిలో నాగార్జునతోనే మూడు సినిమాలు చేసింది.
ఆ సమయంలోనే ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమలో పడడం.. ప్రేమ కాస్త పెద్దలు అనుమతితో పెళ్లి వరకు వెళ్లారు. ఇక అప్పటివరకు సినిమాల కోసం బాలీవుడ్ నుంచి సౌత్ ట్రావెల్స్ చేసిన అమల.. నాగార్జునతో పెళ్లి తర్వాత హైదరాబాద్ లోనే మఖం పెట్టేసింది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై ఫ్యామిలీ ఉమెన్ గా లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే.. అమలా ఓ స్టార్ హీరోయిన్గా.. అక్కినేని కోడలిగా మాత్రమే చాలామందికి తెలుసు. అమల ఇండియన్ అమ్మాయి కాదన్న సంగతి చాలా మందికి తెలియదు. అమల తల్లి ఓ ఫారెనర్.
ఈ క్రమంలోనే అమలకు కూడా మన దేశ పౌరసత్వం లేదట. అమలా తల్లిదండ్రుల విషయానికొస్తే.. తండ్రి బెంగాలీ నావీ ఆఫీసర్ ముఖర్జీ. తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన అమ్మాయి. ఇక వాళ్ళు ఇద్దరు ప్రేమించే వివాహం చేసుకున్నారు. మొదట హాస్పిటల్లో.. అమల తల్లి ఉద్యోగం చేసేదాట. పెళ్లి తర్వాత అమల తల్లిదండ్రులు ఇద్దరు వైజాగ్, చెన్నై లాంటి నగరాల్లో ఉద్యోగాలు చేసి.. చివరకు కోల్‌కత్తాలో సెటిల్ అయినట్లు టాక్. ప్రస్తుతానికి వారు ఏం చేస్తున్నారు తెలియదు కానీ.. అమల , నాగ్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వైరల్‌గా మారింది. అమల లానే అఖిల్‌కి కూడా ఇండియా పౌరసత్వం లేదు. అతను కూడా ఫారన్‌లోనే పుట్టడట.