ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ తాజాగా నవంబర్ 18న నయనతార బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా నయనతార బియాండ్ దా ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. అందులో మూడు సెకండ్ల నడివి ఉన్న క్లిప్‌ని జత చేయడంతో.. పర్మిషన్ లేకుండా ఆ క్లిప్ ను పెట్టారని నయనతారపై రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ.. ధనుష్ లీగల్ నోటీసులు అందించాడు.
దీనిపై నయనతార ఫైర్ అవుతూ.. మూడు పేజీల లేఖలో చెలరేగిపోయింది. నయనతార ఆ నోట్‌లో… కుటుంబ సభ్యుల సపోర్టుతో ఇండస్ట్రీకి వచ్చావు.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నేను ఎదిగానంటూ బహిరంగ లేక ప్రారంభించి విమర్శిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీనిపై తాజాగా హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా రియాక్ట్ అయ్యారు. వెన్నుపోటు పొడిచే వాళ్లకు సమాధానం చెప్పాల్సినంత అవసరం.. టైము రెంటూ మాకు లేవు అంటూ వివరించాడు.
నాకు మా పనే ముఖ్యం. ఆ గొడవలు పటించుకోకుండా ముందుకు సాగుతున్న. నాకులాగే నా కొడుకు కూడా పని ముఖ్యం అని ఆలోచిస్తాడు. అందుకే.. మేము వెన్నుపోటు పొడిచే వారికి సమాధానం చెప్పము అంటూ కస్తూరి రాజా వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలోనే వెన్నుపోటు అనే అంత పెద్ద మాట మాట్లాడారంటే.. నయనతార, ధనుష్ మధ్యన తెరపై చూపించినదే కాకుండా.. మరి ఏదో పెద్ద వివాదమే ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.