ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్.. ఇక ప్రభాస్ కెరీర్ గురించి మొదలు పెట్టాలంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజై టాక్‌తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ప్రభాస్ నుంచి చివరిగా తెరకెక్కిన సలార్, కల్కి రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజి టైటిల్‌తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పై అఫీషియల్ ప్రకటన రాకున్నా.. ప్రస్తుతానికి ఇదే వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతుంది. దీంతోపాటే ప్రభాస్.. మారుతి డైరెక్షన్లోనూ కామెడీ హారర్ థ్రిల్లర్ రాజాసాబ్ లో నటిస్తున్నాడు.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో నటుడు విటివి గణేష్ ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. ఈయనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తరికెక్కిన జైలర్ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్ తో భారీ పాపులారిటి దక్కించుకున్నాడు. విటివి గణేష్.. అనగానే టక్కన గుర్తుకు రాకపోవచ్చు ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్.. అనే డైలాగ్ చెప్పగానే ఆ నటుడు టక్కున గుర్తుకు వస్తాడు. ఇక ఈ డైలాగ్ భారీ పాపులారిటి దక్కించుకుంది. ఇప్పటికీ ఎన్నో మీమ్స్‌లో ఈ డైలాగులు వాడుతూనే ఉన్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే గణేష్.. రాజాసాబ్ సినిమాలో కీలక పాత్రల్లో చేస్తున్న సమయంలోనే.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని నటించాల్సి వచ్చిందట.
కేవలం ఒక్కరోజులో షూటింగ్ అయిపోయే ఆ రోల్ కోసం గణేష్‌ను మూవీ యూనిట్ సిలిచారట. దానికోసం డైరెక్టర్ మారుతిని గణేష్ పర్మిషన్ అడిగాడు. అప్పుడు ప్రభాస్ అక్కడే ఉన్నారని.. ఎవరి సినిమా.. ఏంటి అని చాలా విషయాలు అడిగారని చెప్పుకొచ్చాడు. గణేష్.. అనిల్ రావిపూడి సినిమా అని చెప్పగానే కామెడీ సినిమాలు చేస్తాడు అతనే కదా.. అని ప్రభాస్ అన్నాడని.. కాదు సార్ బాలయ్యతో భగవంత్ కేసరి లాంటి ఎమోషనల్ సినిమాను కూడా తెరకెక్కించాడు అంటూ వివరించానని.. గణేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గణేష్ చేసిన కామెంట్స్ వైరెల్ అవడంతో.. అనిల్ రావిపూడి అంటే ప్రభాస్కు కేవలం కామెడీ డైరెక్టర్ గానే తెలుసా.. ఆయన చేసిన భగవంత్ కేసరి సినిమా గురించి ప్రభాస్కు తెలియదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అనిల్ తన సేఫ్ జోన్ విడిచి కొత్త రకం సినిమాలతో సక్సెస్ అందుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే భగవంత్ కేసరి బ్లాక్ బాస్టర్ అందుకుంది.